నిరసనకారులపై షూట్ చేయలేక, మయన్మార్ నుంచి భారత్ పారిపోయి వస్తున్న పోలీసులు.
నిరసనకారులు మరణించేంతవరకు వారిపై కాల్పులు జరపాల్సిందిగా తమ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలను పాటించలేక మయన్మార్ లోని పలువురు పోలీసులు ఇండియాకు పారిపోయి వచ్చేస్తున్నారు.
నిరసనకారులు మరణించేంతవరకు వారిపై కాల్పులు జరపాల్సిందిగా తమ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలను పాటించలేక మయన్మార్ లోని పలువురు పోలీసులు ఇండియాకు పారిపోయి వచ్చేస్తున్నారు. రహస్యంగా తమ కుటుంబాలతో బాటు ఈ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవల మయన్మార్ లోని ఖాంపాట్ టౌన్ కి చెందిన 27 ఏళ్ళథా పెంగ్ అనే పోలీసు ఇలా భారత్ లో మిజోరం సరిహద్దులకు చేరుకున్నాడు. మయన్మార్ లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టేందుకు సైన్యం, పోలీసులు విచక్షణా రహితంగా రబ్బర్ బులెట్లు, అసలైన తూటాలను వినియోగిస్తున్నారు. ఈ కాల్పుల్లో పలువురు మరణించి, గాయపడుతున్నా వారు తమ అమానుషాన్ని కొనసాగిస్తున్నారు. నిరాయుధులైనవారిని అణచివేసేందుకు నానా నిరంకుశ పధ్దతులను పాటిస్తున్నారు. థా పెంగ్ తాను తమ దేశంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి చెబుతూ .. ప్రొటెస్టరర్ల పై నీ గన్ తో వారు మరణించేంతవరకు కాల్పులు జరపాలని తనపై అధికారి ఆదేశించాడని, అయితే తాను ఇందుకు ఒప్పుకోక పోవడంతో.. తన మీద ఫైర్ చేసి చూడాలని ఆగ్రహంతో వ్యాఖ్యానించాడని తెలిపాడు. అతని వేధింపులు భరించలేక తాను తన కుటుంబంతో బాటు పారిపోయి వచ్చా నని, తమ సైన్యానికి, పోలీసులకు చిక్కకుండా మూడు రాత్రుళ్ళు రహస్యంగా పరారై వచ్చ్చానని ఆ మయన్మార్ పోలీసు చెప్పాడు. అనువాదకుడి సాయంతో మిజోరం అధికారులు అతడు చెప్పిందంతా విన్నారు. అతని ఐడెంటిటీ కార్డు తదితరాలను పరిశీలించి అతడు చెప్పింది నిజమేనని తేల్చుకున్నారు.
తనతో బాటు తన మరో ఆరుగురు సహచర పోలీసులు కూడా గత ఫిబ్రవరి 27 న పారిపోయి వచ్చినట్టు చెప్పాడు. .ఈ నెల 1 న మయన్మార్ కు చెందిన ఓ పోలీసు అధికారి కూడా మరో ముగ్గురు కానిస్టేబుల్స్ తో బాటు మయన్మార్-భారత్ సరిహద్దులకు చేరుకున్నాడు. వీరంతా తమ సైనికాధికారుల లేక పోలీసు అధికారుల ఆదేశాలను పాటించడానికి నిరాకరించినవారే.. నిరసనకారుల్లో మహిళలు, విద్యార్థులు, యువకులు కూడా ఉన్నారని, వారిని అరెస్టు చేయవలసిందిగానో, లేదా వారి కాళ్లపై కాల్పులు జరిపి వారు పడిపోయేలా చేయాల్సిందిగానో తమ పై అధికారులు ఆదేశించేవారని వీరు తెలిపారు. తమ దేశంలో సైనిక ప్రభుత్వం ప్రొటెస్టర్లపట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
సిక్సర్లతో ఇండియా లెజెండ్స్ వీరవిహారం.. ఆఖరి వరకు ఉత్కంఠ.. మ్యాచ్‌ను మాత్రం గెలవలేకపోయారు..