AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila New Party: లోటస్‌పాండ్‌కు చేరుకున్న వరంగల్‌ అభిమానులు.. షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై లీకులు

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల వేగం పెంచారు. ఇటీవలె అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన షర్మిల.. వివిధ జిల్లాల్లోని వైఎస్‌ అభిమానులకు..

YS Sharmila New Party: లోటస్‌పాండ్‌కు చేరుకున్న వరంగల్‌ అభిమానులు.. షర్మిల పోటీ చేసే నియోజకవర్గంపై లీకులు
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల
K Sammaiah
|

Updated on: Mar 10, 2021 | 1:52 PM

Share

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల వేగం పెంచారు. ఇటీవలె అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన షర్మిల.. వివిధ జిల్లాల్లోని వైఎస్‌ అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లోని మేధావులతో చర్చలు జరిపారు. పార్టీ జెండా, అజెండాను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏయే అంశాల్లో ఉందో లిస్టు ప్రిపేర్‌ చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప‌లు జిల్లాల నుంచి వచ్చే వైఎస్ అభిమానుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న వైఎస్ ష‌ర్మిల కొత్త పార్టీ పెడ‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె పార్టీ పేరు, జెండా, అజెండాపై ప‌లు అంశాలు లీక్ అవుతున్నాయి. ఈరోజు ఆమె వరంగల్‌ జిల్లా వైఎస్‌ అభిమానులతో సమావేశం అయ్యారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ విధివిధానాలపై చర్చిస్తున్నారు. త‌న తండ్రి పేరు క‌లిసివ‌చ్చేలా పార్టీకి ‘వైఎస్ఆర్ ‎టీపీ’గా పేరు పెట్టాల‌ని ష‌ర్మిల భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే, పార్టీ జెండాలో మూడు రంగులు ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. అందులో ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు వుంటాయని తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీపై ఆమె ఇప్ప‌టి నుంచే ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదైనా ఓ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు హైదరాబాద్‎లోని ఓ నియోజకవర్గంలో కూడా పోటీ చేయాల‌ని ఆమె భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే ష‌ర్మిల ప‌లు జిల్లాల నేత‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడారు. అలాగే, ఈ నెల‌ 19న కరీంనగర్ జిల్లా అభిమానులతో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే భారీ సభలో ఆమె త‌న‌ పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిసింది.

Read More:

AP Municipal Elections 2021: అమెరికా టు అనంతపురం.. ఓటు కోసం సప్త సముద్రాలు దాటొచ్చిన యువతి

Telangana Million March: ఆ అపురూప ఘట్టానికి సరిగ్గా పదేళ్లు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జైతెలంగాణ’ ఆవాజ్‌