AP Municipal Elections 2021: అమెరికా టు అనంతపురం.. ఓటు కోసం సప్త సముద్రాలు దాటొచ్చిన యువతి

బద్దకస్తులైన ఓటర్లకు ఓ యువతి ఆదర్శంగా నిలిచారు. తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అమెరికా టు అనంతపురం చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు..

AP Municipal Elections 2021: అమెరికా టు అనంతపురం.. ఓటు కోసం సప్త సముద్రాలు దాటొచ్చిన యువతి
Follow us

|

Updated on: Mar 10, 2021 | 1:36 PM

Municipal Elections: ఏ ఏన్నికలైనా పోలింగ్‌ తేదీ వస్తే చాలు సెలవురోజుగా భావిస్తారు ఓటర్లు, అప్పటి వరకు హుషారుగా ప్రచారం చేసిన వారు సైతం పోలింగ్‌ విషయం వచ్చేసరికి దూరంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడంలో చదువుకున్నవారికంటే చదువుకోనివారే కాస్త నయమనిపిస్తుంటుంది. ఓ అరగంట క్యూలో నిల్చుని ఓటేసేందుకు తెగ ఆయాసపడిపోతుంటారు ఓటర్లు.

చదువుకున్న ఓటర్లు కనీసం ఇల్లు దాటి బయటకు వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు కూడా ఆసక్తి చూపరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఎంతో మంది వృద్ధులు ఓటు హక్కును బాధ్యతగా భావించి కాస్త కష్టమైనప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. కానీ యువత మాత్రం పోలింగ్‌ తేదీ వచ్చిందంటే చాటు ఇతరప్రాంతాలకు షికారు కడతారు. ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రించారు.

అయితే బద్దకస్తులైన ఓటర్లకు ఓ యువతి ఆదర్శంగా నిలిచారు. తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అమెరికా టు అనంతపురం చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు అనంత మహిమ. పెదనాన్న, ఎమ్మెల్యే అనంతతో కలిసి ఓటు వేసిన వైనం అక్కడున్న ఓటర్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. మన తల రాతల్ని మార్చేసే నాయకుల రాతలను ఒక్క ‘సిరా చుక్క’తో మార్చేసే అవకాశం ఓటుతోనే వస్తుంది. చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి శ్రద్ధ చూపించరు. ‘‘ఓటు వేయడం నా ఇష్టం.. నేను వేస్తే వేస్తాను..లేకపోతే లేదు’’ అనుకుంటారు. కానీ ఉన్నత విద్య కోసం అనంతపురం నుంచి అమెరికాకు వెళ్లిన ఓ యువతి.. నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు. ఓటు ఎంత విలువైందో చాటిచెప్పారు.

ఆమె ఎవరో కాదు.. సాక్షాత్తూ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సోదరుడు అనంత సుబ్బారెడ్డి కుమార్తె అనంత మహిమ. అమెరికా నుంచి మంగళవారం అనంతపురం చేరుకున్న ఆమె.. బుధవారం తన పెదనాన్న అనంత వెంకట రామిరెడ్డితో కలసి ఓటు వేశారు. కోర్టు రోడ్డులోని నెహ్రూ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతటి విలువైనదో నిరూపించారు. మన ఊరి అభివృద్ధి కోసం, భావి తరాల ఉజ్వల భవిత కోసం ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అనంత మహిమ కోరారు.

Read More:

AP Municipal Elections 2021: ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఎంత అంటే..

AP Municipal Elections 2021: డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఓటు గల్లంతు.. ఏలూరు ఓటరు లిస్టులో గందరగోళం