AP Municipal Elections 2021: డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఓటు గల్లంతు.. ఏలూరు ఓటరు లిస్టులో గందరగోళం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. డివిజన్లలో ఓటర్ల విభజన సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం..
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవాడనికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్ జరుగుతోంది.
అయితే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. డివిజన్లలో ఓటర్ల విభజన సరిగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఓటు ఎక్కుడుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రానికి వెల్లిని ఆళ్లనాని ఓటు వేయకుండానే వెనుతిరిగారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మంత్రి ఓటు ఏ డివిజన్‌లో ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల తీరుపై మంత్రి ఆళ్లనాని అసహనం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్, వైఎస్సార్ జిల్లా కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.
Read More:
Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయం