Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్‌.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా..

Municipal Elections 2021: మచిలీపట్నంలో కొనసాగుతున్న పోలింగ్‌.. వృద్ద ఓటర్లకు పోలీసుల సహాయం
Follow us
K Sammaiah

| Edited By: Ravi Kiran

Updated on: Mar 10, 2021 | 10:53 AM

AP Municipal Elections: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్, శిశు విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఈడేపల్లి, పద్మావతి వీడి కళాశాల ఈడేపల్లి, CSI ప్రైమరీ స్కూల్ బలరాముని పేట , బిస్మిల్లా ఫ్లవర్ మర్చంట్ షాదీఖానా పోలింగ్ కేంద్రం, B.E.D కళాశాల, హుస్సైని స్కూల్ దేశాయిపేట, ఉల్లింగ్ పాలెం అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ గారు సందర్శించారు

పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. పోలింగ్‌ కేంద్రం నుంచి 100మీటర్ల పరిధిని రెడ్ ప్రాంతంగా గుర్తించాలన్నారు. అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో ఐదు చోట్ల జరిగే మునిసిపల్ ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లాలో 145 వార్డులు ఉండగా 140 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక, పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, SI, CI, DSP స్థాయి అధికారులను నియమించాం. పోలీసులు చేసిన గ్రౌండ్ వర్క్ వల్ల పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో జరిగాయో, అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో 55 హైపర్ సెన్సిటివ్ లొకేషన్ ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నికల వేళ సమస్యలు సృష్టించే 250 మంది రౌడీ షీటర్ లను గుర్తించి బైండోవర్ చేయడం జరిగింది. రౌడీషీటర్లు పై షాడో నిఘా కొనసాగుతుంది, వారు ఎటువంటి సంఘటనలో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా, నగర బహిష్కరణ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత, స్ట్రాంగ్ రూముల్లో వద్ద అర్ముడు రిజర్వ్ సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం నికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వయసు పైబడిన వృద్ధులు, వికలాంగులు నడవలేక యాతన పడడంతో విధుల్లో ఉన్న పోలీసులు సహాయం అందించి ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు.

నూజివీడు మున్సిపాలిటీలో బందోబస్తులో ఉన్న గుడివాడ సిసిఎస్ సిఐ సిహెచ్.వి. మురళీకృష్ణ తన సేవా దృక్పథం చాటుకున్నారు. గత కొంతకాలంగా జిల్లా ఎస్పి ఎం.రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరడంతో అందులో భాగంగా నేడు గొడుగువారిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద ఒక 80 సంవత్సరాలు పైబడి వృద్ధ మహిళ పైగా వికలాంగురాలిని సీఐ మరియు ఒక కానిస్టేబుల్ సాయంతో ఆమెను ఎత్తుకుని పోలింగ్ బూత్ లోకి తీసుకువెళ్ళి ఓటు వేయించి మరీ ఇంటికి చేర్చారు. గత పంచాయతీ ఎన్నికల్లోనూ, నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకోలేని వారికి సాయశక్తులా సాయం చేస్తూ ఓటు వేయిస్తూ సేవా దృక్పథం చాటుకుంటున్నారు.

Read More:

Municipal Elections 2021: ఏపీలో ప్రశాంతంగా పోలింగ్‌.. విజయవాడలో పవన్‌ కల్యాణ్‌.. విశాఖలో విజయసాయిరెడ్డి ఓటు

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో