China Spy Ship: శ్రీలంక పోర్టుకు చైనా నిఘా షిప్.. భారత్ తీవ్ర అభ్యంతరం..

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ పడవను వినియోగించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టు హంబంటోటాకు (China Spy Ship) షిప్ రావడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది.

China Spy Ship: శ్రీలంక పోర్టుకు చైనా నిఘా షిప్.. భారత్ తీవ్ర అభ్యంతరం..
China Spy Ship
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2022 | 7:15 AM

Sri Lanka – China: భారత్ అభ్యంతరం చెప్పినా.. చైనా నిఘా పడవకు శ్రీలంక అనుమతించింది. త్వరలోనే చైనా స్పై షిప్ శ్రీలంక పోర్టుకు చేరనుంది.హిందూ మహాసముద్రంపై, శ్రీలంకపై చైనా తన ఇన్‌ఫ్లుయెన్స్ పెంచుకున్నట్టు మన దేశం భావిస్తోంది. ఈ రెండింటిపై చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువాన్ వాంగ్ 5 పడవను స్పేస్, శాటిలైట్‌ల ట్రాకింగ్ కోసం పంపుతున్నారా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ పడవను వినియోగించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టు హంబంటోటాకు (China Spy Ship) షిప్ రావడాన్ని భారత్ అభ్యంతరం తెలిపింది. ఆ షిప్‌ను అనుతించవద్దని శ్రీలంకకు సూచించింది. వాస్తవానికి ఈ షిప్ ఆగస్టు 11వ తేదీనే రావల్సింది. కానీ, భారత్ సూచనల మేరకు శ్రీలంక అనుమతులు ఇవ్వలేదు. అయితే.. తాజాగా, మళ్లీ ఆ షిప్‌కు అనుమతి ఇచ్చింది. శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఈ నెల 16 నుంచి 22 మధ్య రావడానికి అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు భారత విదేశాంగ శాఖ నుంచి అనుమతులు వచ్చాయని తెలిపింది. ఈ రోజు తమకు డిప్లమాటిక్ క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. ఈ షిప్‌ను హ్యాండిల్ చేయడానికి స్థానిక ఏజెంట్లతో మాట్లాడుతామని తెలిపారు.ఈ షిప్ భారత కార్యకలాపాలు, భారత మిలిటరీ కేంద్రాలు సహా పలు అంశాలపై నిఘా వేసే అవకాశం ఉన్నదని మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, శ్రీలంక ఇప్పుడు చైనా షిప్‌కు అనుమతి ఇవ్వడం ఇప్పడు చర్చనీయాంసమైంది.

ఇవి కూడా చదవండి

 మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం