Chennai: మత్తు మందు ఇచ్చి నగల మాయం.. చెన్నై అరుంబాకంలోని ఫెడరల్‌ బ్యాంక్‌లో భారీ చోరీ..

చెన్నైలో బ్యాంకును చెరబట్టారు దొంగలు. లాకర్లలోని బంగారు నగల్ని మాయం చేశారు. అరుంబాకంలోని ఫెడరల్‌ బ్యాంకులో జరిగిందీ ఇన్సిడెంట్‌.

Chennai: మత్తు మందు ఇచ్చి నగల మాయం.. చెన్నై అరుంబాకంలోని ఫెడరల్‌ బ్యాంక్‌లో భారీ చోరీ..
Robbery
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 13, 2022 | 10:11 PM

ఇంటి దొంగలే బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టారు. నమ్మించి కోట్లు కొల్లగొట్టారు. తమిళనాడు రాజధాని చెన్నై ఫెడరల్‌ బ్యాంకును అడ్డంగా దోచేశారు దొంగలు. బ్యాంకు సిబ్బంది మత్తు మందు ఇచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారని చెబుతున్నారు పోలీసులు. దొంగ‌లు ఇచ్చిన మ‌త్తు మందుతో బ్యాంకు సిబ్బంది స్పృహ కోల్పోయారు. ముంద‌స్తు ప్రణాళిక‌లో భాగంగా బ్యాంకులోని బంగారాన్ని ఎలాంటి ప్రతిఘ‌ట‌న లేకుండానే ఎత్తుకెళ్లారు. దొంగ‌లు బంగారాన్ని ఎత్తుకెళ్లిన చాలా సేప‌టికి స్పృహ‌లోకి వ‌చ్చిన బ్యాంకు సిబ్బంది జ‌రిగిన విష‌యాన్ని తెలుసుకుని బావురుమ‌న్నారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరీ ఘటనపై ఆరాతీస్తున్నారు. లాకర్ల నుంచి చోరీ అయిన బంగారు నగల విలువ 20 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. దొంగతనం గుట్టు విప్పేందుకు నాలుగు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. అడిషనల్‌​కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్​స్వయంగా దర్యాప్తులో భాగమయ్యారు.

మొత్తం ముగ్గురు వ్యక్తులు.. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చారు. బ్యాంకులోకి వినియోగదారుల మాదిరిగా ప్రవేశించారు దొంగ‌లు. సెక్యూరిటీ గార్డు, సిబ్బందిని కట్టివేసి కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బ్యాంకులో పనిచేసేవారే దొంగతనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉద్యోగి మురుగన్‌ చోరీ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. బ్యాంక్‌ సిబ్బందిని లోతుగా విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం