MK Stalin – YS Jagan: జల జగడం.. ఆ నదిపై ఆనకట్టలు నిర్మించొద్దు.. సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ..

కుశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని.. ఈ రెండు ఆనకట్టల వల్ల భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలో తెలిపారు.

MK Stalin - YS Jagan: జల జగడం.. ఆ నదిపై ఆనకట్టలు నిర్మించొద్దు.. సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ..
Ys Jagan Mk Stalin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2022 | 6:49 AM

CM Stalin Letter To Jagan : ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దీనిపై ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. కుశస్థలి నదిపై ఏపీ సర్కార్‌ నిర్మిస్తున్న ఆనకట్టలను ఖండిస్తున్నామన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దని సూచించారు. రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే చెన్నైకి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడుతుందని సీఎం స్టాలిన్‌ లేఖలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కతరపల్లి, ముక్కలకండిగై గ్రామాల్లో కుశస్థలి నదిపై రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని.. ఈ రెండు ఆనకట్టల వల్ల భవిష్యత్తులో చెన్నై నగరానికి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని లేఖలో తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్. దీని వల్ల చెన్నై నగరానికి తాగునీటిని అందించేందుకు నిర్మిస్తున్న పూండీ రిజర్వాయర్‌కు నీరు రాకుండా పోతుందని లేఖలో తెలిపారు.

తమిళనాడు సరిహద్దులో నగరి దగ్గర కుశస్థలి నదికి వరదలొస్తే నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా ఒడిసిపట్టేందుకు గొలుసుకట్టు విధానంలో 20 చెరువులకు మళ్లించేలా ప్రాజెక్టుల్ని చేపట్టింది ఏపీ ప్రభుత్వం. కుశస్థలి నది నుంచి నీటిని దారి మళ్లించి చెరువులకు సరఫరా చేసేందుకు ఏపీ సర్కార్‌ ప్రయత్నించగా, 2017లో వచ్చిన వరదల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అప్పటి నుంచి పనులు చేపట్టలేదు. విస్తారంగా వర్షాలు కురిసినా.. కుశస్థలి నది నుంచి నీరు మాత్రం చెరువులకు చేరకుండా వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. దీంతో నగరి ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు.

అయితే.. ఇక్కడ ఆనకట్టలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నా, తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు అభ్యంతరం చెప్పలేదు. అయితే ఇప్పుడు సీఎం స్టాలిన్‌ లేఖ రాయడంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తెరపైకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా