AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: తనయుడిపై తల్లి లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. అనుమానం వ్యక్తంచేసిన సుప్రీం

కన్న కుమారుడిని తల్లే లైంగికంగా వేధిస్తున్న కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అనుమానం వ్యక్తం చేసింది. తనయుడు అలా వాంగ్మూలం ఇచ్చేలా తండ్రి ప్రేరేపించి ఉండొచ్చని అభిప్రాయపడింది. కేరళలోని తిరువనంతపురం...

Supreme Court: తనయుడిపై తల్లి లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. అనుమానం వ్యక్తంచేసిన సుప్రీం
Supreme Court Main
Ganesh Mudavath
|

Updated on: Aug 13, 2022 | 5:55 PM

Share

కన్న కుమారుడిని తల్లే లైంగికంగా వేధిస్తున్న కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అనుమానం వ్యక్తం చేసింది. తనయుడు అలా వాంగ్మూలం ఇచ్చేలా తండ్రి ప్రేరేపించి ఉండొచ్చని అభిప్రాయపడింది. కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కడక్కవూర్‌లో రెండేళ్ల క్రితం నమోదైన బాలల వేధింపుల కేసు దిగ్భ్రాంతికి గురి చేసిందని వెల్లడించింది. తన నుంచి విడిపోయిన భార్యను ఇరికించేందుకు బాలుడి తండ్రి ఇలా చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఈ కేసును లోతుగా విచారించాలని దర్యాప్తును సూచించింది. గతేడాది చివర్లో కేరళ (Kerala) హైకోర్టు తల్లిని నిర్దోషిగా విడుదల చేయడంతో కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తండ్రి తన భార్యతో వైవాహిక వివాదాల్లో కుమారిడిని పావుగా ఉపయోగించుకుంటన్నాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బాలుడు.. తన తల్లికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడన్న కోర్టు పరిశీలనను ప్రాసిక్యూషన్ లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అతని తల్లిపై ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేస్తున్నారు.

కుమారుడే కాదు తల్లి కూడా మానసిక ఒత్తిడి, వేధింపులకు గురవుతున్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఈ కేసులో ఆమెను బాధితురాలిగా పరిగణించవచ్చని కోర్టు ప్రాథమిక పరిశీలనలో పేర్కొంది. పోలీసు విచారణ నివేదిక సరైనది కాదన్న వాదనకు గల కారణాలనూ పిటిషనర్ నుంచి తెలుసుకోవాలని కోరింది. తల్లి నిర్దోషి అంటూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నివేదికను వ్యతిరేకిస్తూ కుమారుడు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బాలుడి ఆరోపణలు నిరాధారమైనవని పోలీసు బృందం పోస్కో కోర్టుకు నివేదిక సమర్పించింది. నలుగురు పిల్లల తల్లి అయిన ఆ మహిళ తన కొడుకు ఫిర్యాదుతో 27 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి