AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఆరోగ్యకరమే కదా అని గుడ్లను అధికంగా తినేస్తున్నారా.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పదార్థం గుడ్డు (Egg). గుడ్లు పోషకాలకు స్టోర్ హౌజ్ అని చెప్పవచ్చు. ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక గుడ్డులో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్స్,...

Health: ఆరోగ్యకరమే కదా అని గుడ్లను అధికంగా తినేస్తున్నారా.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Egg
Ganesh Mudavath
|

Updated on: Aug 13, 2022 | 3:34 PM

Share

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే పదార్థం గుడ్డు (Egg). గుడ్లు పోషకాలకు స్టోర్ హౌజ్ అని చెప్పవచ్చు. ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక గుడ్డులో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు ఇలా సమస్తం ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే అదే పనిగా గుడ్లను తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అతిగా తింటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్డులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడం మంచిది కాదని చాలా మంది భావిస్తారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఆరు గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు (Health Problems) తగ్గుతాయని కొన్ని పరివోధనల్లో వెల్లడైంది. గుడ్లలో ఎక్కువగా ఉండే ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుడ్డులో ఉండే అనేక పోషకాలు ఎముకలు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది. కోడిగుడ్డులోని పచ్చసొనలో కేలరీలు, ప్రోటీన్స్, విటమిన్ బీ6, విటమిన్ కే ఉన్నాయి. కోడిగుడ్డులో సెలీనియం ఉంటుంది. తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు బ్రెయిన్‌ని షార్ప్‌ నెస్ పెంచుతుంది. పిల్లలకు రోజూ గుడ్డు తినిపిస్తే వారి ఆరోగ్యం పటిష్ఠంగా మారుతుంది. ముఖ్యంగా గర్భిణీలు రోజూ గుడ్లు తింటే తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే.. పచ్చసొన అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రతి సారి ఆహారం తీసుకునేటప్పుడు గుడ్లు చేర్చడం సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే, మంచిది కదా అని గుడ్లను అధికంగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధికంగా తీసుకుంటే ఏ ఆహారమైనా ఔషధంలా కాకుండా విషంలా మారుతుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి గుడ్లు తినే విషయంలో ముందుగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!