Onion Cutting: చాలా ఈజీగా ఉల్లిగడ్డను కట్ చేయొచ్చు.. ఈ వీడియో చూస్తే సింపుల్ ట్రిక్ తెలిసిపోతుంది..
వంట చేయడాన్ని కొంతమంది ఇష్టంగా.. మరికొంంత మంది కష్టంగా భావిస్తారు. ఎందుకంటే వంట చేయడం కన్నా.. ఏదైనా కూరలు చేసేటప్పడు.. కూరగాయలు కట్ చేయడం,
వంట చేయడాన్ని కొంతమంది ఇష్టంగా.. మరికొంంత మంది కష్టంగా భావిస్తారు. ఎందుకంటే వంట చేయడం కన్నా.. ఏదైనా కూరలు చేసేటప్పడు.. కూరగాయలు కట్ చేయడం, ఉడకబెట్టడం, కూరగాయలతో పాటు కూరకు అవసరమైన మిగిలిన పదార్థాలను రెడీ చేసుకోవడం వంటివి ఒక్కోసారి విసుగు కూడా తెప్పిస్తాయి. వీటిలో ముఖ్యంగా ఉల్లిపాయలు కోయడాన్ని చాలా కష్టంగా ఫీలవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఉల్లిపాయలు కోస్తూ..కోసేవారే కాదు.. ఇంట్లో ఉన్నవారంతా కన్నీళ్లు కారుస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అరటిపండును వొలిచినంత ఈజీగా ఆనీయన్స్ ను కట్ చేయొచ్చు.
ఓ చిన్న టెక్నిక్ తో జస్ట్ ఇంట్లో ఉండే షాకుతో చాలా ఈజీగా ఉల్లిపాయలు కట్ చేయ్చొచ్చు.ఇన్ స్టాగ్రామ్ లో @frommylittlekitchen తన పేజీలో ఓ వీడియోని పోస్టు చేసింది. ఉల్లిపాయను తలక్రిందులుగా చేసి.. షాకుతో నిలువుగా కట్ చేసి..ఆతర్వాత దానిని పక్కకు ఉంచి పొరలు పొరలుగా కత్తిరిస్తే 30 సెకన్లలోపే మొత్తం ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయ్యొచ్చు. మరి ఈచిన్న ట్రిక్ ను ఫాలో అయి ఉల్లిపాయలను ఈజీగా కట్ చేసేద్దాం.
View this post on Instagram
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..