AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Tea: ఉల్లి టీ ఎప్పుడైనా తాగారా? బీపీ అదుపుకు అద్భుత ఔషధం..

నేటి జీవనశైలి కారణంగా హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు లేదా బీపీ సర్వసాధారణం అయిపోయింది. బ్లడ్ ప్రెజర్‌ అధికంగా ఉంటే అనతికాలంలోనే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర హృదయ సంబంధిత సమస్యలు పొంచి..

Onion Tea: ఉల్లి టీ ఎప్పుడైనా తాగారా? బీపీ అదుపుకు అద్భుత ఔషధం..
Onion Tea
Srilakshmi C
|

Updated on: Aug 13, 2022 | 1:27 PM

Share

onion tea for hypertension: నేటి జీవనశైలి కారణంగా హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు లేదా బీపీ సర్వసాధారణం అయిపోయింది. బ్లడ్ ప్రెజర్‌ అధికంగా ఉంటే అనతికాలంలోనే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర హృదయ సంబంధిత సమస్యలు పొంచి ఉంటాయి. ఐతే ప్రతిరోజూ ఒక కప్పు ఆనియన్‌ టీ తాగడం వల్ల బీపీని కంట్రోల్‌ చేయవచ్చని మీకు తెలుసా? ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ ఉల్లి టీ తయారీ, ప్రయోజనాలు మీకోసం..

ఉల్లిపాయలో ఫ్లేవనాల్, క్వెర్సెటిన్ అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆహారంలో భాగంగా ఉల్లిపాయ తీసుకోవడం, దీనితో తయారు చేసిన టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవచని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ఆనియన్‌ టీ ఏవిధంగా తయారు చేయాలో తెలుసుకుందాం..

ఆనియన్ టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

ఇవి కూడా చదవండి
  • తరిగిన ఉల్లిపాయ: 1
  • లవంగాలుచ వెల్లుల్లి మొగ్గలు: 2 లేదా 3
  • తేనె: 1 టేబుల్ స్పూన్
  • నీళ్లు: 1 లేదా 2 కప్పులు
  • బే ఆకు లేదా దాల్చిన చెక్క: 1 లేదా 2

ఆనియన్ టీ తయారీ విధానం.. ముందుగా స్టవ్‌పై పాన్‌ ఉంచి అందులో నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత మరిగిన నీటిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి, లవంగాలు, బే ఆకులను వేసి మరిగించాలి. నీటి రంగు మారిన తర్వాత.. ఒక కప్పులో ఒడ కట్టాలి. రుచికి సరిపడా తేనె, దాల్చిన చెక్క పొడిని కలుపుకుంటే ఉల్లిపాయ టీ రెడీ! ఈ టీని రోజూ ఉదయం తాగడం వల్ల మీరు ఎనర్జిటిక్‌గా ఉండటమేకాకుండా బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్‌గా ఉంటుంది.