AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR: ప్రకృతిని ఆస్వాదిస్తూ చుక్కల్ని లెక్కపెడుతూ.. ఆ మార్గంలో ప్రత్యేక రైలు ఇదే తొలిసారి

సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే మధ్యతరగతి ప్రజలకు రైలు (Train) బండి దోహదకారిగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త, ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. అయితే రైళ్లన్నీ చూసేందుకు ఒకేలా....

SCR: ప్రకృతిని ఆస్వాదిస్తూ చుక్కల్ని లెక్కపెడుతూ.. ఆ మార్గంలో ప్రత్యేక రైలు ఇదే తొలిసారి
Shatabdi Express
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 13, 2022 | 4:23 PM

సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే మధ్యతరగతి ప్రజలకు రైలు (Train) బండి దోహదకారిగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త, ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. అయితే రైళ్లన్నీ చూసేందుకు ఒకేలా ఉంటాయి. కానీ ఈ రైలు మాత్రం వాటన్నింటికి చాలా భిన్నం. ఈ రైలుకు అన్ని వైపులా అద్దాలే ఉండడం విశేషం. సికింద్రాబాద్‌-పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాగా.. ఈ రైలు కరోనా కారణంగా రెండున్నరేళ్ల క్రితం రద్దయింది. అప్పటి నుంచి సర్వీసులు అందించని ఈ రైలును తాజాగా అధికారులు పునరుద్ధరించారు. ఈ రైలుకు మరిన్ని కొత్త హంగులు అద్దుతూ అన్నీ ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు ఏర్పాటుచేశారు. అంతే కాకుండా అద్దాల బోగీలో ప్రకృతిని ఆస్వాదిస్తూ విశాల నింగిని చూస్తూ ప్రయాణించేలా ఓ విస్టాడోమ్‌ కోచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి కోచ్‌తో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి రైలు ఇదే కావడం విశేషం.

నంబర్- 12026/12025 గల పుణె-సికింద్రాబాద్‌-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ లో అద్దాల బోగీ సదుపాయం ఉంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.45కు బయల్దేరి అదేరోజు రాత్రి 11.10కి పుణె చేరుతుంది. తిరుగు ప్రయాణంలో పుణెలో ఉదయం 6.00 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు బేగంపేట, వికారాబాద్‌, తాండూర్‌, వాడి, కలబురిగి, షోలాపుర్‌ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు నడుస్తుంది. బోగీలో రెండువైపులా సాధారణ కిటికీలకు బదులుగా పెద్దపెద్ద అద్దాల కిటికీలు ఉంటాయి. కోచ్‌ పైకప్పూ మందపాటి గాజుతో చేసిందే. ప్రయాణ సమయంలో రైలుమార్గానికి ఇరువైపులా కొండలు, లోయలు, జలపాతాలు వంటి ప్రకృతి అందాలను చూస్తూ హాయిగా ముందుకు సాగిపోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..