AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్‌.. ఆ ఐటీ కారిడార్‌లోని ఆ రూట్లలో వెళ్లొద్దు.

Traffic Diversion: వజ్రోత్సవాల సందర్బంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందులో ప్రత్యేకించి కొన్ని దారుల్లో ఈ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అలర్ట్‌.. ఆ ఐటీ కారిడార్‌లోని ఆ రూట్లలో వెళ్లొద్దు.
Hyderabad Traffic Restricti
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2022 | 4:43 PM

Share

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందులో ప్రత్యేకించి కొన్ని దారుల్లో ఈ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో ఐటీ కారిడార్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ రూల్స్ అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఫ్రీడమ్‌ రైడ్‌ నేపథ్యంలో దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి వరకు పలు దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.

ఇందులో కేబుల్‌ బ్రిడ్జి వద్ద ప్రారంభమయ్యే ఫ్రీడమ్‌ రన్‌ ఐకియా రోటరీ వద్ద కుడి వైపు, లెమన్‌ ట్రీ హహోటల్, ఫీనిక్స్‌ ఐటీ హబ్, డెల్, టెక్‌ మహీంద్రా(TCS), సీఐఐ జంక్షన్‌ మీదుగా మెటల్‌ చార్మినార్‌ వరకు కొనసాగుతుందన్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ.

అక్కడి నుంచి ఇందిరాగాంధీ విగ్రహం, సైబర్‌టవర్‌ జంక్షన్‌లో కుడి వైపునకు వెళ్లి మెడికవర్‌ హాస్పిటల్‌ మీదుగా మైండ్‌ స్పైస్‌ గేట్, రోటరీలో ఎడమ వైపు టీ హబ్‌ జంక్షన్, మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్, మై హోం భూజ, ఎన్‌సీబీ జంక్షన్‌ నుంచి సైబరాబాద్‌ కమిషనరేట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరానగర్, విప్రో జంక్షన్, ఐసీఐసీఐ బ్యాంక్, కోకాపేట్‌ రోటరీ వద్ద యుటర్న్‌ తీసుకొని ఐసీఐసీఐ జంక్షన్, విప్రో జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, ఎడమ వైపు టర్న్‌ తీసుకొని హెచ్‌సీయూ డిపో వద్ద యూటర్న్‌ తీసుకొని గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటుందన్నారు.

Traffic Diversion Points:

1. ఇదిలావుంటే.. కావూరీహిల్స్‌ జంక్షన్‌ నుంచి..: గచ్చిబౌలి వైపు నుంచి జూబ్లీహిల్స్‌ వెళ్లే వారు సీఓడీ జంక్షన్‌(ఫర్చున్ టవర్స్) నుంచి మళ్లిస్తారు. సైబర్‌ టవర్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ అండర్‌ పాస్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి రైట్ టర్న్ చేసుకుని గచ్చిబౌలి జంక్షన్‌కు వెళ్లవచ్చు.

2. రోడ్డు నెంబర్‌ 45 నుంచి ఐటీసీ కోహినూర్‌ వైపు: రోడ్డు నెంబర్‌ 45 నుంచి ఐటీసీ కోహినూర్‌ వైపు వచ్చేవారు గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను సీవోడీ జంక్షన్, మాదాపూర్‌ పీఎస్‌కు మళ్లిస్తారు. కావూరీహిల్స్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ.. సైబర్‌ టవర్‌ జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు. సైబర్‌ టవర్‌ నుంచి ఎన్‌సీబీ జంక్షన్‌ వరకు, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు అనుమతించరు. విప్రో నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ , కొత్తగూడ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వాహనాలను అనుమతించరు.

3. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్‌ పీఎస్‌ల పరిధిలో ట్రక్కులు, లారీలు, రెడిమిక్స్‌లు, డీసీఎంలకు అనుమతి లేదు.

అటుగా వెళ్లేందుకు ఒక్కసారి రూట్ చూసుకున్న తర్వాతే మీరు రైడ్ మొదలు పెట్టండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..