ప్రాణాల మీదకు తెచ్చిన ఆపిల్ ఫోన్ మోజు.. కొన్న తొమ్మిది నెలలకే మంచానికే పరిమితం..!

స్మార్ట్ ఫోన్లు లేనిదే ప్రస్తుతం పూట గడవదు. ఇవాళ రేపు ప్రతి ఇంట్లో కుటుంబసభ్యుల కంటే సెల్ ఫోన్ల సంఖ్యనే ఎక్కువ.

ప్రాణాల మీదకు తెచ్చిన ఆపిల్ ఫోన్ మోజు.. కొన్న తొమ్మిది నెలలకే మంచానికే పరిమితం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 17, 2020 | 6:59 PM

స్మార్ట్ ఫోన్లు లేనిదే ప్రస్తుతం పూట గడవదు. ఇవాళ రేపు ప్రతి ఇంట్లో కుటుంబసభ్యుల కంటే సెల్ ఫోన్ల సంఖ్యనే ఎక్కువ.. వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడం కోసం ఎగబడుతున్నారు. వాటి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఆపిల్‌ ఐఫోన్‌ను దక్కించుకోవడం మధ్యతరగతివారికి తీరని కల. అందుకే ఈ ఫోన్‌ కొత్త మోడల్‌ రిలీజ్‌ అయినప్పుడల్లా దానిపై జోకులు పేలుతూ ఉంటాయి. అవసరమైతే కిడ్నీ అమ్మి అయినా కొనాలంటూ సెటైర్లు పేలుతుంటాయి. అయితే, చైనాకు చెందిన ఓ యువకుడు నిజంగానే ఐఫోన్‌కోసం తన కిడ్నీ అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో రెండు ఐఫోన్లు కొన్నాడు. కానీ.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచంపట్టాడు. అతడికి ఫోన్‌పై ఉన్న మక్కువ ప్రాణాల మీదకు వచ్చిందట.

చైనాకు చెందిన వాంగ్‌షాంగ్‌ అన్నంత పని చేశాడు. ఆపిల్‌ ఫోన్‌ కొనేందుకు తన మూత్రపిండాల్లో ఒకదాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన కిడ్నీని బ్లాక్‌ మార్కెట్లో సుమారు 2,73,273 అమెరికన్‌ డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. దీంతో వచ్చిన డబ్బుతో ఐఫోన్ 4, ఐప్యాడ్ 2ను అనే రెండు ఆపిల్ ఫోన్లను కొనేశాడు. అయితే, కిడ్నీ అమ్మిన తొమ్మిది నెలల తర్వాత మరో మూత్రపిండంలో సమస్య తలెత్తింది. దీంతో వైద్యులను సంప్రదించడంతో ప్రతిరోజు డయాలసిస్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, అతడు బెడ్‌కే పరిమితం కావల్సివచ్చింది. ఇదిలా ఉండగా, వాంగ్‌ కిడ్నీ అమ్మిన విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు