సోమాలియా రాజధాని మొగదిషులో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి
సోమాలియాలో ఉగ్రవాది రెచ్చిపోయారు. ఆ దేశ రాజధాని మొగదిషులోని పోలీసు అకాడమీ దగ్గరి రెస్టారెంట్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు
Somalia suicide bomb: సోమాలియాలో ఉగ్రవాది రెచ్చిపోయారు. ఆ దేశ రాజధాని మొగదిషులోని పోలీసు అకాడమీ దగ్గరి రెస్టారెంట్‌లో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదు మంది చనిపోగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి ధ్రువీకరించారు. పోలీసులు తరచుగా వెళ్లే రెస్టారెంట్‌ని ఉగ్రవాది టార్గెట్ చేసి, ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు తాము బాధ్యులంటూ అల్‌ఖైదా సన్నిహిత సంస్థ అల్-షాబాబ్ వెల్లడించింది.
Read More:
ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమే.. సీఎస్ లేఖకు నిమ్మగడ్డ సమాధానం
కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 948 కొత్త కేసులు.. ఐదుగురు మృతి.. కోలుకున్న 1,607 మంది