మౌత్‌వాష్‌తో 30 సెకన్లలోనే కరోనా అంతం.. యూకే కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల వెల్లడి

డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ మౌత్‌వాష్‌ వల్ల 30 సెకన్లలోనే అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మౌత్‌వాష్‌తో 30 సెకన్లలోనే కరోనా అంతం.. యూకే కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల వెల్లడి
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 17, 2020 | 6:31 PM

#Mouthwashcankillcorona: ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి వైద్య పరంగా అప్రమత్తతో పాటు, పర్యావరణ పరంగా మానవజాతి మనుగడను మరోసారి గుర్తు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలు ముందు నుంచి మన సమాజాల్లో కొనసాగుతున్నాయి. కానీ, కాలానుగుణమైన వేగం, అభివృద్ది మాటున అవి మరుగున పడిపోయాయి. ఇప్పుడు విజృభించిన కరోనా ఆ విషయాలతో పాటు పర్యావరణ పరంగా మన బాధ్యతారాహిత్యాన్ని కూడా గుర్తు చేసింది.

డ్రాగన్ కంట్రీ నుంచి ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ మౌత్‌వాష్‌ వల్ల 30 సెకన్లలోనే అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. దాదాపు 0.07% సెటీపెరిడినమ్‌ క్లోరైడ్‌ రసాయనం కలిగి ఉన్న ఏ మౌత్‌వాష్‌ అయినా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తమ పరిశోధనలో తేలిందని కార్డిఫ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు.

డెంటిల్‌ అనే బ్రాండ్‌ మౌత్‌వాష్‌ను ఉపయోగించి కార్డిఫ్‌ యూనివర్సిటీలోని ప్రయోగశాలల్లో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మౌత్‌వాష్‌తో 12 వారాల పాటు ఫ్రొఫెసర్‌ డేవిడ్‌ థామస్‌ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిపామని వెల్లడించారు. ‘ల్యాబ్‌లో చేసిన పరిశోధనల్లో మౌత్‌వాష్‌ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. కరోనా బాధితులపై అధ్యయనం చేసినపుడు ఏ విధంగా ఫలితం వస్తుందో చూడాల్సి ఉందని ఫ్రొఫెసర్‌ థామస్‌ అన్నారు.

2021 తొలినాళ్లలో జరగనున్న క్లినికల్‌ ట్రయల్స్‌లో కొవిడ్‌ బారిన పడిన వారు మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల కలిగే లాభం, ప్రభావం ఎంతకాలం ఉంటాయో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన చాలా ముఖ్యమైనదని నిక్‌ క్లేడన్‌ అనే వైద్య నిపుణుడు పేర్కొన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫలితాలు సానుకూలంగా వస్తే కరోనా కట్టడికి ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న శానిటైజర్లు, మాస్కుల జాబితాలో మౌత్‌వాష్‌ కూడా చేరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.