నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహనసేవ..పరిమిత సంఖ్యలో అనుమతి
కార్తీక మాసం ప్రారంభమవడంతో తిరుమల కొండపై భక్తుల సందడి పెరిగింది. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పరిమిత
Pedda Sesha Vahana Seva : కార్తీక మాసం ప్రారంభమవడంతో తిరుమల కొండపై భక్తుల సందడి పెరిగింది. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
నాగుల చవితిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలో పెద్ద శేషవాహన సేవ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి 7 నుంచి 8:30 గంటల మధ్య వాహన సేవ నిర్వహించనున్నారు.
మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏటా నాగులచవితి నాడు పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా ప్రభావం వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.