AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Marriages: ఆ దేశంలో వింత ఆచారం.. దెయ్యానికి పెళ్లి.. 3 వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం

Ghost Marriages in China: మనిషి ఆధునిక విజ్ఞానాన్ని ఎంత సంపాదించినా.. పూర్వం నుంచి కొన్నింటిని నమ్మకాల పేరుతో ఆచరిస్తూనే ఉంటారు. వాటిల్లో కొన్ని మూఢనమ్మకాలని..

Ghost Marriages: ఆ దేశంలో వింత ఆచారం.. దెయ్యానికి పెళ్లి.. 3 వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం
China Ghost Marriage
Surya Kala
|

Updated on: Nov 27, 2021 | 4:04 PM

Share

Ghost Marriages in China: మనిషి ఆధునిక విజ్ఞానాన్ని ఎంత సంపాదించినా.. పూర్వం నుంచి కొన్నింటిని నమ్మకాల పేరుతో ఆచరిస్తూనే ఉంటారు. వాటిల్లో కొన్ని మూఢనమ్మకాలని చెప్పవచ్చు. పప్రంచంలోని ప్రతి దేశంలోనూ మూఢనమ్మకాలనేవి ఉన్నాయి. అది భారత దేశమైన.. చైనా అమెరికా, ఆఫ్రికా ఏ దేశమైనా ఒకటే.. ఇక చైనాలో కూడా ఓ వింత ఆచారం ఉంది. అదేంటంటే దెయ్యానికి పెళ్లి చేయడం. దెయ్యానికి పెళ్లేంటి? ఎలా చేస్తారు అనుకుంటున్నారు కదా… ముందు మీకో విషయం చెప్పాలి. ఇటీవల చైనాలోని సోషల్‌మీడియాలో పాపులర్‌ అయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పెళ్లి కాలేదు. ఇలా పెళ్లి కాకుండా చనిపోయినవాళ్లు ప్రేతాత్మలై… తీవ్ర నిరాశతో ఉంటారనీ… కొన్నాళ్లకు ఆ ఆత్మలు కోపంతో రగిలిపోతాయని కొందరు నమ్ముతారు. అలాంటి ఆత్మలకు పెళ్లి చేయడం ద్వారా శాంతిస్తాయన్నది వారి నమ్మకం. ఇందుకోసం వాళ్లు పెళ్లి కాకుండా చనిపోయిన రెండు ఆత్మల అస్థికలు తీసుకొని… వాటితో ఏవో మంత్రపూజలు చేసి… పెళ్లి జరిపిస్తారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు నుంచి సోషల్‌ మీడియాలో విషాదకర మాటలు మాట్లాడుతూ… అలాంటి పోస్టులే పెట్టింది. చనిపోయే ముందు రోజు పెట్టిన వీడియోలో కూడా అదే తన చివరి వీడియో కావచ్చు అని తెలిపింది. అక్టోబర్ 15న ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు అందిస్తుండగా చనిపోయినట్లు చైనా మీడియా రిపోర్టులు తెలిపాయి. లక్షల మంది అభిమానులు ఉండీ.. ఆమె సూసైడ్ చేసుకోవడం ఎవరికీ అర్ధంకాలేదు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపారు. ఐతే… స్మశానంలో పనిచేసే ఓ వ్యక్తి… ఆమె అస్థికలను దొంగిలించి.. ఎవరికో అమ్మేశాడట. వాళ్లు వాటి ద్వారా దెయ్యం పెళ్లి చెయ్యించాలని డిసైడైనట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయ్యింది.

అయితే చైనాలో ఈ ఆచారం 3వేల సంవత్సరాలుగా కొనసాగుతోందట. సాధారణంగా ఇలాంటి పెళ్లిళ్లను చనిపోయిన వారి తల్లిదండ్రులు జరిపిస్తుంటారు. వారే చనిపోయిన వారికి జోడీ ఆత్మను కూడా వెతుకుతారు. ఆ తర్వాత తంతును మంత్రగాళ్లు చేస్తారు. చైనా కొన్ని దశాబ్దాలకు పూర్వమే దీన్ని నిషేధించింది. అయినా ఇది రహస్యంగా కొనసాగుతోంది. ఇప్పుడైతే… ఇది ఆన్‌లైన్‌ బిజినెస్‌గా మారిపోయింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జోడీ ఆత్మకి సంబంధించిన అస్థికలను కూడా అమ్మేస్తున్నారని తెలిసింది. చైనా అమ్మాయి అస్థికల్ని దొంగిలించాక… వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు కేటుగాళ్లనూ పోలీసులు అరెస్టు చేశారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:  అన్నం వద్దు ఇసుక ముద్దు అంటున్న బామ్మ.. గత 60ఏళ్లుగా ఇసుకే భోజనం.. రోజుకి ఎంత తింటుందో తెలిస్తే షాక్..