Wandering Elephants: ఎట్టకేలకు ఇంటికి చేరిన ఏనుగుల కథ.. 500 కి.మీ మేర ప్రయాణించి సరికొత్త రికార్డు..
ఎట్టకేలకు కథ ఇంటికి చేరింది.. అవును చాలా రోజులుగా నడుస్తున్న గజరాజులు తమ స్వంత స్థలానికి చేరుకున్నాయి. చైనాలో సంచరిస్తున్న ఏనుగులు ఎట్టకేలకు తమ ఆవాసానికి చేరుకున్నాయి. కొన్ని నెలల పాటు ప్రయాణం చేసిన ...
ఎట్టకేలకు కథ ఇంటికి చేరింది.. అవును చాలా రోజులుగా నడుస్తున్న గజరాజులు తమ స్వంత స్థలానికి చేరుకున్నాయి. చైనాలో సంచరిస్తున్న ఏనుగులు ఎట్టకేలకు తమ ఆవాసానికి చేరుకున్నాయి. కొన్ని నెలల పాటు ప్రయాణం చేసిన ఈ ఏనుగులు చైనా నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌కు చేరుకున్నాయి. గత ఐదు రోజులుగా ఏనుగుల మంద యుగ్జీ నగరం సమీపంలో సంచరించింది. స్థానిక అధికారులు డ్రోన్ల సాయంతో వాటి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. యుగ్జీ నగరం నుంచి ఏనుగుల మంద అడవుల్లోకి తమ ప్రయాణం కొనసాగించింది.
ఈ సమయంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి అవి తిరుగు ముఖం పడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది ఏనుగుల గుంపు జిషింగ్‌బన్న దాయ్ ప్రాంతంలోని అడవుల నుంచి 500 కి.మీ మేర ప్రయాణించి జూన్ 2న కున్మేందుకు చేరుకున్నాయి. ఇది గమనించిన ఫారెస్ట్ అధికారులు వాటిని జాగ్రత్తగా తిరిగి చేరుకునేందుకు భారీ ఆపరేష్ నిర్వహించారు. ఇందు కోసం ఓ మాటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. వీరు కొన్ని డ్రోన్ హెలికాప్టర్ల ద్వారా వాటి కదలికలను పరిశీలించారు. రాత్రి సమయంలో కూడా వాటిని పరిశీలించారు.
అయితే అవి వెళ్తున్న దారిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పక్కగా ప్లాన్ చేశారు అక్కడి ఫారెస్ట్ అధికారులు. వాటి మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అవి రద్దీ జనావాసాల్లోకి రాకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. గతేడాది యువాన్ ఫ్రావిన్స్‌లోని రిజర్వ్ నుంచి బయటకువచ్చిన 16 అడవి ఏనుగులు 500 కిలోమీటర్లు పయనించాయి. మొత్తంగా 16 గజరాజులు రిజర్వ్ నుంచి బయటకు రాగా.. వాటిలో రెండు తిరిగి వెనక్కి వెళ్లిపోయాయి.
ఈ ఏనుగుల మంద ఒక సంవత్సరానికి పైగా ఉత్తరం వైపు నుంచి కదులుతూ సొంత గ్రామానికి చేరుకున్నాయి. ఈ మధ్యకాలంలో వాటి ప్రతి కదలికల వీడియోలను రికార్డు చేసిన అక్కడి అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోల్లో అవి చేసే సందడి ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. గత కొన్ని నెలల్లో అవి సోషల్ మీడియా స్టార్లుగా మారాయి. నిద్రించడం, మట్టి స్నానం చేయడం.. ఆడుకోవడం వంటి వారి కార్యకలాపాలు మిలియన్ల మందిని ఆకర్షించాయి.
ఇవి కూడా చదవండి: Mysterious Lake of No Return: ఈ సరస్సులోకి దిగినవారు తిరిగి రాలేదు.. ఇండియన్ బెర్ముడాగా పిలిచే ఈ పర్యాటక ప్రాంతం ఎక్కడుందో తెలుసా..
Gupta Nidhulu: ధనవంతులుగా మారండి.. ఆ గుప్తనిధులు మీ సొంతం కావచ్చు.. మాటల మాంత్రికులకు మోత మొగింది..