China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. పలువురికి గాయాలు..

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం అయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చైనాలోని..

China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. పలువురికి గాయాలు..
China Fire Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 26, 2022 | 1:15 PM

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం అయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చైనాలోని షింజియాంగ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు భారీగా చెలరేగడంతో అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటలలో అపార్ట్‌మెంట్ వాసులందరూ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకుని 10 మంది సజీవ దహనం అవగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు.

చైనాను వణికిస్తున్న కరోనా..

కరోనా నుంచి ఇప్పుడిప్పుడు తేరకుంటున్న ప్రపంచాన్ని మరోసారి గడగడలాడిస్తుంది కోవిడ్. వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుంది. మరోసారి భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. చైనాలో కొత్తగా 31 వేల 454 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి చైనాలో ఒక్కరోజులో ఇంత మందికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారి కాగా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 27 వేల 517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. పెరుగుతున్న వైరస్ ను అరికట్టేందుకు చైనా అధికారులు చర్యలు ప్రారంభించారు. మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో కరోనా టెస్ట్ లు చేస్తున్నారు.

ప్రజా రవాణాను అరికడుతూ లాక్‌ డౌన్ లతో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు యత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చైనాలోని యాపిల్‌కు చెందిన ఐఫోన్ ప్లాంట్‌లో ఆందోళనలు చెలరేగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. జెంగ్‌జూ ప్రాంతంలో యాపిల్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇంటికి వేళ్లలేక తీవ్ర అవస్థలు పడ్డారు. మానసిక, శారీరిక ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి నిరసనకు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్