Harsh Goenka – Elon Musk: మస్క్ ను తక్కువ అంచనా వేయకండి..! అతడి పిచ్చితనానికి కచ్చితంగా అర్థం – గోయెంకా
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ‘ట్విట్టర్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సగం మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలిగించిన మస్క్..
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ‘ట్విట్టర్ రెస్ట్ ఇన్ పీస్’ అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సగం మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలిగించిన మస్క్.. మిగిలిన వారు అసాధారణ స్థాయిలో రోజంతా పని చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో మస్క్ తీరు నచ్చక మిగిలిన వారు కూడా ఒక్కొక్కరు ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో మస్క్ ట్విట్టర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలో, ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ను తక్కువ అంచనా వేయకండి అంటున్నారు. మస్క్.. మస్త్ మేధావి… అతన్ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అతడి పిచ్చితనానికి కచ్చితంగా ఏదో ఒక అర్ధం, విధానం అంటూ ఉంటుంది. అది టెస్లా అయినా, స్పేస్ ఎక్స్ అయినా లేక బోరింగ్ కంపెనీ అయినా సరే, అతడు తన కాలానికంటే ముందున్నాడు. మస్క్ వద్ద తప్పకుండా మనం అర్థం చేసుకోలేని గేమ్ ప్లాన్ ఉంటుంది. అతడిని అంచనా వేసే ముందు, తనకి కొంత సమయం ఇచ్చి చూద్దాం’’ అంటూ గోయంకా ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

