Cab For Robbery: వీడో ఘరానాదొంగ..! క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి మరీ బ్యాంకు దోపిడి.. చివరకు..
దోపిడీ చేయాలనుకునేవాళ్లు పోలీసులకు ఏ చిన్న క్లూ కూడా దొరక్కుండా ప్లాన్ చేసుకొని దొంగతనం చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఘరానా దొంగ సినీ ఫక్కీలో దోపిడీకి ప్లాన్ చేశాడు. చివరకు ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.
ఈ దొంగ ఓ బ్యాంకులో దోపిడీకి ఎలా వెళ్లాడో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. అమెరికాలోని మిచిగాన్ సౌత్‌ఫీల్డ్‌లో నవంబర్ 16న ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి పేరు జెసన్ క్రిస్ట్‌మస్. ఇతను బ్యాంకులో దోపిడీకి వెళ్లేందుకు ఉబర్ కారు బుక్ చేసుకున్నాడు. బ్యాంకులో పని ఉందని, డ్రైవర్ హంటింగ్‌టన్ బ్యాంకు బయట వెయిట్ చేయమని చెప్పి అతను లోపలికి వెళ్లాడు. దీంతో డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు. అనంతరం తుపాకీతో బ్యాంకు లోపలికి వెళ్లిన జేసన్.. అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత హుందాగా తిరిగి కారు వద్దకు వచ్చాడు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో అతడు జేసన్‌ను తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేశాడు.అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఉబర్ కార్ నెంబర్ ప్లేట్ ఆధారంగా డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆ దోపిడీ గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. డ్రైవర్‌కు దోపిడీతో సంబంధం లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఉబర్ డేటా ఆధారంగా జేసన్ అడ్రస్ పట్టుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..