Woman Hitting President: ఆ దేశాధ్యక్షుడి చెంప పగలగొట్టిన మహిళ.! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ఓ దేశాధ్యక్షుడినే చెంపపగిలేలా కొట్టింది ఓ మహిళ. ఊహించని పరిణామానికి షాకైన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఓ మహిళ అధ్యక్షుడి చెంపను ఛెళ్‌మనిపించింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ఎక్కడికో వెళ్తున్నారు. అదే సమయంలో ఆలివ్ గ్రీన్ టీ షర్ట్ ధరించిన మహిళ ఎదురుపడి మాక్రాన్ చెంప పగులగొట్టింది. ఒక్కసారిగా దాడి జరుగడంతో మాక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది? అధ్యక్షుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటీ ? అనే వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది జూన్ 8న సైతం ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నది. డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి, కొవిడ్ ప్రొటోకాల్స్ చెక్ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు మాక్రాన్ కారు వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలో అధ్యక్షుడిని చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. దీంతో మాక్రాన్ బారికేడ్ల దగ్గరికెళ్లి వారితో కరచానలాలు చేశారు. ఆ సమయంలో ఓ యువకుడు అధ్యక్షుడికి షేక్ హ్యాడ్ ఇచ్చినట్లే ఇచ్చి చెంప పగలగొట్టాడు. అనూహ్య సంఘటనతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులు సదరు యువకుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆ యువకుడు మాక్రాన్ అతివాద ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..