AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: చైనా నుంచి కొత్త ‘విపత్తు’..! ఇప్పటికే ఇద్దరు మరణం.. WHO హెచ్చరికలు..

China: చైనాలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. తాజాగా ఐదు కేసులను నిర్దారించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) H5N6 వైరస్‌కు

China: చైనా నుంచి కొత్త 'విపత్తు'..! ఇప్పటికే ఇద్దరు మరణం.. WHO హెచ్చరికలు..
China Bird Flu
uppula Raju
|

Updated on: Jan 16, 2022 | 7:08 AM

Share

China: చైనాలో బర్డ్ ఫ్లూ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. తాజాగా ఐదు కేసులను నిర్దారించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) H5N6 వైరస్‌కు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చైనాలో రోజు రోజుకి బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య పెరగడం నిపుణుల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. మరోవైపు బర్డ్ ఫ్లూ మరింత సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనావైరస్ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఇదే సమయంలో ఈ కొత్త వైరస్ ఆందోళనను మరింతగా పెంచుతోంది.

గత ఏడాది డిసెంబర్‌లో సిచువాన్ ప్రావిన్స్, జెజియాంగ్ ప్రావిన్స్, గ్వాంగ్సీ అటానమస్ రీజియన్‌లో ఐదుగురు వ్యక్తులు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా స్ట్రెయిన్ బారిన పడ్డారని హాంకాంగ్ ఆరోగ్య శాఖ తెలిపింది. డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మరణించారు మరో ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని లుజౌకు చెందిన 75 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 1న దేశీయ కోడి వల్ల అస్వస్థతకు గురయ్యాడు. నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా డిసెంబర్ 12న మరణించాడు.

వివిధ ప్రాంతాల్లో చాలా మందికి వ్యాధి సోకినట్లు అనుమానాలు

సిచువాన్ ప్రావిన్స్‌లోని లెషాన్ ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి కూడా డిసెంబర్ 8న అస్వస్థతకు గురయ్యాడు. మూడు వారాల తర్వాత అంటే డిసెంబర్ 24న ఈ వ్యక్తి మరణించాడు. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌకు చెందిన 51 ఏళ్ల మహిళ డిసెంబర్ 15న దేశీయ కోడి వల్ల అస్వస్థతకు గురైంది. డిసెంబర్ 18న ఆమెని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించిందని అధికారులు తెలిపారు. గ్వాంగ్జీ అటానమస్ రీజియన్‌లోని లియుజౌ నగరంలో మరో రెండు కేసులు నమోదైనట్లు హాంకాంగ్ ఆరోగ్య విభాగం తెలిపింది. 53 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 19 న అస్వస్థతకు గురయ్యాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే నగరానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి కూడా డిసెంబర్ 23న అస్వస్థతకు గురయ్యాడు అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. రెండో వ్యక్తికి ఎలా సోకింది అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

పౌల్ట్రీతో పరిచయం ఉన్న వ్యక్తులకు బర్డ్‌ ఫ్లూ

2014 నుంచి ఇప్పటి వరకు 65 మందికి హెచ్5ఎన్6 బర్డ్ ఫ్లూ సోకింది. అయితే అందులో సగానికి పైగా కేసులు గత ఆరు నెలల్లోనే నమోదయ్యాయి. సోకిన వారిలో ఎక్కువ మంది పౌల్ట్రీతో సంబంధం కలిగి ఉన్నవారే. అయితే ఇప్పటివరకు వైరస్ జంతువుల నుంచి మనిషికి సోకినట్లు ఎక్కడ నిర్దారణ కాలేదని WHO తెలిపింది. కానీ పెరుగుతున్న కేసులను స్టడీ చేయడానికి తదుపరి విచారణ అవసరమని పేర్కొంది. చైనా ప్రపంచంలోనే పౌల్ట్రీలో అతిపెద్ద ఉత్పత్తిదారు ముఖ్యంగా బాతుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటుంది. ఇవి ఫ్లూ వైరస్‌కు ప్రధాన వనరుగా పనిచేస్తాయి.

ప్రతి నొప్పికి ఔషధం మీ వంటగదిలోనే ఉంది..! కరోనా సమయంలో వాటిని గుర్తించడం అత్యవసరం..

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లతో రోగనిరోధక శక్తి పెంచుకోండి.. ఒమిక్రాన్‌ని అంతం చేయండి..

దూరాన్ని తెలిపే రాళ్లపై పసుపు, కొన్నిసార్లు ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది.. వీటి అర్థం ఏంటో తెలుసా..?