Corona Vaccine: భారతదేశం నుంచి కెన‌డాకు వెళ్లే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌..!

Corona Vaccine: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింటి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో..

Corona Vaccine: భారతదేశం నుంచి కెన‌డాకు వెళ్లే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 20, 2021 | 9:01 PM

Corona Vaccine: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింటి. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు పరిశోధకులు తీవ్రంగా కృషి చేసి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇక భారత్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారికి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికేట్‌ను సైతం చూపించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణికులకు ఆయా దేశాలు అనుమతి ఇస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భారత్‌ నుంచి కెనడా వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు అందింది.

కరోనా నియంత్రణకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ను ఈనెల 30వ తేదీ నుంచి కెనడాలో గుర్తించనుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన వ్యాక్సిన్లు వేసుకున్న ప్రయాణికులను ఈ నెలాఖరు నుంచి తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ఆ దేశం పేర్కొంది. కొవాగ్జిన్‌తో పాటు సినోఫార్మ్‌, సీఓవాక్‌ వ్యాక్సిన్లనూ కెనడా గుర్తించనుంది. ఇప్పటికే గుర్తించిన ఏ వ్యాక్సిన్‌ అయినా రెండు డోసులు వేసుకున్నవారిని, అలాగే మిశ్రమ డోసులు వేసుకున్న వారిని తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తామని కెనడా ప్రభుత్వం తెలిపింది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వారి సింగిల్‌ డోస్‌ జన్‌స్పెన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి అనుమతి ఉంటుందని వెల్లడించింది. అయితే ప్రయాణికులు కెనడాకు వెళ్లడానికి 14 రోజుల ముందు వ్యాక్సిన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో దాదాపు చాలా మంది టీకాలు తీసుకున్నారు. విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు సైతం కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

COVID Booster Dose: కరోనా బూస్టర్ డోస్ తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన అమెరికా

Corona Vaccines: ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్ని డోసులు అందాయో తెలిపిన కేంద్రం..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!