ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు… 20 మంది మృతి… పలువురికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పేలుడు కారణంగా మసీదు పైకప్పు పడిపోయిందని, ఇప్పటివరకు 20 మందికి పైగా చనిపోయినట్లు నంగార్హార్ ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అత్తౌల్లా […]

ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు... 20 మంది మృతి... పలువురికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 6:38 PM

ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పేలుడు కారణంగా మసీదు పైకప్పు పడిపోయిందని, ఇప్పటివరకు 20 మందికి పైగా చనిపోయినట్లు నంగార్హార్ ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అత్తౌల్లా ఖోగ్యాని తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో బలగాలను భారీగా మోహరించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.