పక్షి దెబ్బకు కోట్ల నష్టం.. అసలు కథ వింటే షాక్..

పక్షి దెబ్బకు కోట్ల నష్టం.. అసలు కథ వింటే షాక్..

ఆ విమానంతో అణుదాడులు చేసి.. దేశాలనే నేలమట్టం చేయవచ్చు. యుద్ధాల సమయంలో అధినేతలకు రక్షణ కూడా కల్పించవచ్చు. కానీ అలాంటి విమానానికి చిన్న పక్షి.. ప్రమాదకరంగా మారింది. ఓ చిన్న పక్షి ఆ విమానాన్ని ఢీ కొట్టింది. అంతే దెబ్బకు ఆ విమానం పాడైపోయింది. అంతేనా..తిరిగి ఆ విమానాన్ని రిపేర్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చిందట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే. అమెరికాలో మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్‌ రివర్‌ నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో అక్టోబర్ 2న […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 19, 2019 | 1:36 PM

ఆ విమానంతో అణుదాడులు చేసి.. దేశాలనే నేలమట్టం చేయవచ్చు. యుద్ధాల సమయంలో అధినేతలకు రక్షణ కూడా కల్పించవచ్చు. కానీ అలాంటి విమానానికి చిన్న పక్షి.. ప్రమాదకరంగా మారింది. ఓ చిన్న పక్షి ఆ విమానాన్ని ఢీ కొట్టింది. అంతే దెబ్బకు ఆ విమానం పాడైపోయింది. అంతేనా..తిరిగి ఆ విమానాన్ని రిపేర్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చిందట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే.

అమెరికాలో మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్‌ రివర్‌ నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో అక్టోబర్ 2న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ-6బీ మెర్క్యురీ రకం విమానం రన్‌వేపైకి వస్తున్న క్రమంలో ఓ పక్షి ఢీకొంది. దీంతో పైలట్లు విమానాన్ని వెంటనే సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, విమానానికి మాత్రం భారీ నష్టం వాటిల్లింది. పక్షి ఢీకొనడంతో విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతిందని.. దీంతో విమానానికి దాదాపు రూ.14 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని.. అధికారులు తెలిపారు. ఈ ప్రమాదాన్ని “ఏ-క్లాస్‌” ప్రమాదంగా పేర్కొంది. ఈ విమానం ఖరీదు పది వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu