వ్యాక్సిన్ వివాదం..బ్రెజిల్ కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేసుకున్న భారత్ బయోటెక్.. ఇక కోవాగ్జిన్ సరఫరా లేనట్టే !

బ్రెజిల్ కి చెందిన రెండు కంపెనీలతో భారత్ బయో టెక్ తన ఒప్పందాలను రద్దు చేసుకుంది. 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆ దేశంలోని రెండు సంస్థలతో 324 మిలియన్ డాలర్ల డీల్ ను భారత్ బయో టెక్ లోగడ కుదుర్చుకుంది.

వ్యాక్సిన్ వివాదం..బ్రెజిల్ కంపెనీలతో ఒప్పందాలను రద్దు చేసుకున్న భారత్ బయోటెక్.. ఇక కోవాగ్జిన్ సరఫరా లేనట్టే !
Bharat Biotech's Covaxin

బ్రెజిల్ కి చెందిన రెండు కంపెనీలతో భారత్ బయో టెక్ తన ఒప్పందాలను రద్దు చేసుకుంది. 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆ దేశంలోని రెండు సంస్థలతో 324 మిలియన్ డాలర్ల డీల్ ను భారత్ బయో టెక్ లోగడ కుదుర్చుకుంది. అయితే ఈ లావాదేవీల్లో అవకతవకలు, అవినీతి జరిగిందని ఆ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సనారోపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను అభిశంసించే ప్రక్రియకు సెనేట్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఎందుకైనా మంచిదని ఆ దేశానికి చెందిన ప్రెసిసా మెడికామెంటోస్ అనే కంపెనీతోను, ఎన్ విక్సియా ఫార్మాస్యుటికల్స్ అనే సంస్థ తోను భారత్ బయోటెక్ తన అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ పై బ్రెజిల్ లో ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమైంది. బ్రెజలియన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, సెనేట్ పానెల్ సైతం దర్యాప్తు సాగిస్తున్నాయి.

ఈ పరిణామాల దృష్ట్యా.. ఈ రెండు కంపెనీలతో తక్షణమే తమ అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. అయితే ఆ దేశ డ్రగ్ రెగ్యులేటరీ అన్విసాతో తమ సంప్రదింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బ్రెజిల్ లో తమ కోవాగ్జిన్ టీకామందును సరఫరా చేసేందుకు గత నవంబరులో ఈ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే వ్యాక్సిన్ ధరకు మించి అక్కడి ప్రభుత్వం కావాలనే ఎక్కువ ధరను కోట్ చేసినట్టు..ఇందులో బ్రెజిల్ అధ్యక్షుని ఓ డొల్ల సంస్థ ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన ఖండించినప్పటికీ విపక్షాలు మాత్రం ఈ డీల్ లో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై దర్యాప్తు జరగాలని, ఆయనను అభిశంసించాలని పట్టు బడుతున్నాయి. మొత్తానికి బ్రెజిల్ దేశానికి ఇక కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరా లేనట్టే !

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 అత్యాశకు పోతే అంతే ఉంటది మరి..!ఇన్సూరెన్స్‌ డబ్బు ఆశతో బెంజ్‌ కారు తగులబెట్టిన వ్యక్తి..:Benz car Video.

 యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

 ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.

Click on your DTH Provider to Add TV9 Telugu