AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: షేక్ హసీనాకు మరో దెబ్బ.. పాస్‌పోర్ట్‌ రద్దు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్ట్ కూడా రద్దయింది.

Bangladesh: షేక్ హసీనాకు మరో దెబ్బ.. పాస్‌పోర్ట్‌ రద్దు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
Sheikh Hasina
Balaraju Goud
|

Updated on: Aug 22, 2024 | 3:01 PM

Share

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయంతో మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్ట్ కూడా రద్దయింది. బంగ్లాదేశ్ హోం శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వ మాజీ ఎంపీల దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. బుధవారం సాయంత్రం నిర్ణయాన్ని ప్రకటించింది హోం మంత్రిత్వ శాఖ. గత ప్రభుత్వ హయాంలో ఎంపీలకు జారీ చేసిన అన్ని దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడానికి తాత్కాలిక ప్రభుత్వం కొన్ని కారణాలను అందించింది. దీనికి ప్రధాన కారణం షేక్ హసీనాపై ఇప్పటివరకు 44 కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, దౌత్య పాస్‌పోర్ట్‌లను రద్దు చేయడం అవసరం. అంతేకాకుండా ఆమె హయాంలో జారీ చేసిన ఇతర ఎంపీల పాస్‌పోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది

బంగ్లాదేశ్‌లో హింసాత్మక రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తరువాత, షేక్ హసీనా ఢాకా నుండి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించి, ధ్వంసం చేశారు. కొన్ని వస్తువులను దోచుకున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత మారిన పరిణామాలతో ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయంలో దిగడం ద్వారా షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. ఆమె ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నారు. ఇక దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన తర్వాత షేక్ హసీనా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్