Baba Vanga Predictions: ఆ ఖండం నుంచే 2025లో మానవ జాతి నాశనానికి పునాది.. షాకింగ్ కలిగిస్తున్న బాబా వంగా అంచనాలు..

ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబా వంగా 2024 కోసం అంచనాలు వేశారు. ఇందులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఘోరమైన దాడి ఉన్నాయి. ఈ అంచనా ఎంతవరకు నిజమయ్యాయో తెలియదు కానీ.. రానున్న సంవత్సరం 2025 లో జరగబోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా అంచనా వేశారు. వీటిల్లో కొన్ని అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో..

Baba Vanga Predictions: ఆ ఖండం నుంచే 2025లో మానవ జాతి నాశనానికి పునాది.. షాకింగ్ కలిగిస్తున్న బాబా వంగా అంచనాలు..
Baba Vanga's 2025 Predictio
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2024 | 12:31 PM

బాబా వంగా గురించి చాలా మందికి తెలుసు. బాబా వంగా బల్గేరియాకు చెందిన ప్రవక్త. ఆమె అసలు పేరు వాంజెలియా పాండేవా దిమిత్రోవ్. 1911లో జన్మించిన బాబా వంగా పన్నెండేళ్ల వయసులో దుమ్ము తుఫానులో శాశ్వతంగా చూపు కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె భవిష్యత్తును చూడటం ప్రారంభించింది. 1966లో మరణించిన బాబా వంగా 51వ శతాబ్దం వరకు భూమిపై జరిగిన ప్రధాన సంఘటనల గురించి అంచనా వేశారు. యువరాణి డయానా మరణం నుంచి 9/11 దాడులు.. జపాన్ వరదలు, బ్రెగ్జిట్ వరకు, బాబా వంగా చెప్పిన అనేక విషయాలు నిజం అయ్యాయి.

ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబా వంగా 2024 కోసం అంచనాలు వేశారు. ఇందులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనడం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఘోరమైన దాడి ఉన్నాయి. ఈ అంచనా ఎంతవరకు నిజమయ్యాయో తెలియదు కానీ.. రానున్న సంవత్సరం 2025 లో జరగబోయే కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా అంచనా వేశారు. వీటిల్లో కొన్ని అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో.

2025 నుంచి ఈ ప్రపంచంలో విపత్తు సంఘటనలు ప్రారంభమవుతాయని.. ఇవి మానవాళి పతనానికి దారితీస్తుందని బాబా వంగా ప్రవచించారు. ఈ విధ్వంసం వచ్చే ఏడాది (2025) ఐరోపాలో సంఘర్షణతో ప్రారంభమవుతుంది..ఇలా మొత్తం మానవ జాతి నాశనానికి పునాది పడి.. 5079 లో ప్రపంచంలో మానవాళి సంచారం పూర్తిగా ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

2025లో ఐరోపాలో యుద్ధం..

  1. 2025వ సంవత్సరాన్ని ప్రళయానికి నాందిగా బాబా వంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె అంచనా ప్రకార మానవుల నాశనం 2025 సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది.
  2. ఐరోపాలో 2025లో విధ్వంసకర వివాదం మొదలవుతుందని బాబా వంగా అంచనా వేశారు. ఈ వివాదం ప్రతిచోటా భారీ విధ్వంసం కలిగిస్తుంది. దీని కారణంలో ఐరోపా ఖండంలోని జనాభా భారీగా క్షీణిస్తుందని జోస్యం చెప్పారు.
  3. ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా మరిన్ని దిగ్భ్రాంతికరమైన, భయానక సంఘటనలు జరుగుతాయని అంచనా వేసింది. బాబావంగా అంచనా ప్రకారం, మనిషి 2028లో శుక్రునిపైకి వెళ్తాడు.
  4. 2033 నాటికి వాతావరణం అనూహ్యంగా మారుతుంది. ఉత్తర ధ్రువం మంచు గడ్డలు కరిగిపోతాయి.. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు భారీగా పెరుగుతాయి.
  5. 2170లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచం తీవ్ర కరువును ఎదుర్కొంటుందని చెప్పారు.
  6. కమ్యూనిజం 2076లో ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. మానవులకు 2130లో ఏలియన్స్‌తో పరిచయం ఏర్పదుతుంది.
  7. 2170లో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కరువు ఏర్పడుతుంది.
  8. బాబా వంగా అంచనా ప్రకారం 3005లో భూమి, అంగారకుడి మధ్య యుద్ధం జరగవచ్చు.
  9. 3797 నాటికి, భూమి నివాసయోగ్యం కాదు. మానవులు వేరే గ్రహంపై ఆశ్రయం పొందవలసి ఉంటుంది.
  10. చివరకు 5079 నాటికి భూమిమీద ఉన్న ప్రతిదీ నాశనం అవుతుంది. ప్రపంచం అంతం అవుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..