AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Criminals: ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్న నేరస్థులు.. రహస్య ఆసుపత్రుల్లో కొత్త దందా..!

Criminals: ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్న నేరస్థులు.. రహస్య ఆసుపత్రుల్లో కొత్త దందా..!

Anil kumar poka
|

Updated on: Jul 13, 2024 | 5:58 PM

Share

చట్టం నుంచి తప్పించుకునేందుకు నేరస్థులు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఫిలిప్పీన్స్‌లో ఇది నిజంగా జరుగుతోంది. వారి రూపురేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆస్పత్రులనే నిర్వహిస్తున్నారు. కుంభకోణాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడినవారు అరెస్టు నుంచి తప్పించుకునేలా ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అక్రమంగా నిర్వహిస్తున్న ఇలాంటి రెండు ఆసుపత్రులను మూసివేయించేందుకు రంగం సిద్ధం చేశారు.

చట్టం నుంచి తప్పించుకునేందుకు నేరస్థులు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఫిలిప్పీన్స్‌లో ఇది నిజంగా జరుగుతోంది. వారి రూపురేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆస్పత్రులనే నిర్వహిస్తున్నారు. కుంభకోణాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడినవారు అరెస్టు నుంచి తప్పించుకునేలా ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అక్రమంగా నిర్వహిస్తున్న ఇలాంటి రెండు ఆసుపత్రులను మూసివేయించేందుకు రంగం సిద్ధం చేశారు. దేశ రాజధాని మనీలా దక్షిణ శివార్లలోని పాసే అనే పట్టణంలో మే నెలలో పోలీసులు రైడ్‌ చేశారు. అక్కడ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ టూల్స్‌, డెంటల్‌ ఇంప్లాంట్స్‌, స్కిన్‌ వైట్‌నింగ్‌ ఐవీ డ్రిప్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని ప్రెసిడెన్షియల్‌ యాంటీ ఆర్గనైజ్డ్‌ క్రైం అధిపతి జాన్‌ కాసియో పేర్కొన్నారు. ఇక్కడ ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు వియత్నాం వాసులు కాగా.. ఒకరు చైనా పౌరుడు. వారికి అక్కడ పని చేయడానికి అనుమతులు లేవు.

మరో రెండు అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఇవి పాసే పట్టణంలోని హాస్పిటల్‌ కంటే నాలుగు రెట్లు పెద్దవని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపుకార్డులను ఎవరూ అడగరని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికొచ్చే క్లయింట్లలో ఎక్కువమంది ఆన్‌లైన్‌ కేసినోలకు చెందినవారని, దీంతోపాటు ఫిలిప్పీన్స్‌లో అక్రమంగా పనిచేస్తున్నవారు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 2022లో చైనా మాఫియాకు చెందినవాడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. అతడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొన్నట్లు గుర్తించారు. ఫిలిప్పీన్స్‌లోని ఆన్‌లైన్‌ కేసినోలు చైనాలోని జూదగాళ్లకు సేవలు అందిస్తుంటాయి. చైనాలో గ్యాంబ్లింగ్‌ నేరం. ఇక ఈ సంస్థలే టెలిఫోన్‌ స్కామ్‌లు, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌లకు పాల్పడుతుంటాయి. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఇవి మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగాయి. కానీ, కొత్తగా మార్కోస్‌ జూనియర్‌ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్‌పై స్కాం దేశంగా ముద్ర పడడాన్ని ఇష్టపడలేదు. దీంతో చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow Us