Sri Lanka: శ్రీలంకలో తీవ్రరూపం దాల్చుతున్న నిరసనలు.. అల్లర్లలో అధికార పార్టీ ఎంపీ మృతి
శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం అల్లర్లకు దారి తీసింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అల్లర్లలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి మృతి చెందారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అవస్థలు...
శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం అల్లర్లకు దారి తీసింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అల్లర్లలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి మృతి చెందారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అవస్థలు ఎదుర్కొంటున్న దేశంలో సమస్య పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతల రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స వెనక్కితగ్గారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన రాజీనామా ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9 నుంచి అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతున్న వారిపై రాజపక్స వర్గీయులు సోమవారం కర్రలతో దాడి చేశారు. టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు.. పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు.
దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాజపక్స వెల్లడించారు. ప్రధాని రాజీనామాతో కేబినెట్ కూడా రద్దు కానుంది. సంక్షోభ పరిస్థితులు ప్రారంభమైన నాటి నుంచి మహింద రాజపక్స ఆదివారం దర్శనమిచ్చారు. అనురాధపురలో బౌద్ధాలయాన్ని ఆయన సందర్శించారు. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన శ్రీలంక క్యాబినెట్.. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక.. నెల వ్యవధిలోనే రెండో సారి ఎమర్జెన్సీని విధించింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీచదవండి
Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ప్రయోజనాలు.. రక్త హీనత, గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం..