AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: అమ్మలకు ఇండియన్‌ రైల్వే మదర్స్‌ డే గిఫ్ట్‌.. రైళ్లలో అందుబాటులోకి ‘బేబీ బెర్త్‌’లు..

Railway News: చంటి పిల్లతో రైలు ప్రయాణం చేయడం ఇబ్బందితో కూడుకున్న విషయం. చిన్నారిని ఒంటరిగా పడుకో బెట్టకోలేరు, అలాగనీ ఒకే సీటులో తల్లీబిడ్డ పడుకోవడం సాధ్యపడదు. దీంతో బిడ్డలతో ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనినే దృష్టిలో పెట్టుకొని...

Railway News: అమ్మలకు ఇండియన్‌ రైల్వే మదర్స్‌ డే గిఫ్ట్‌.. రైళ్లలో అందుబాటులోకి 'బేబీ బెర్త్‌'లు..
Narender Vaitla
|

Updated on: May 10, 2022 | 4:44 PM

Share

Railway News: చంటి పిల్లతో రైలు ప్రయాణం చేయడం ఇబ్బందితో కూడుకున్న విషయం. చిన్నారిని ఒంటరిగా పడుకో బెట్టకోలేరు, అలాగనీ ఒకే సీటులో తల్లీబిడ్డ పడుకోవడం సాధ్యపడదు. దీంతో బిడ్డలతో ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనినే దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్న ఆలోచన చేశారు రైల్వే అధికారులు. నార్తన్‌ రైల్వేకు చెందిన లక్నో, ఢిల్లీ డివిజన్స్‌ సంయుక్తంగా రైళ్లలో బేబీ బెర్త్‌లను ప్రవేశపెట్టారు. వీటిని ఫోల్డ్‌ చేసుకునే వీలుగా రూపొందించారు.

ఈ బెర్త్‌లను మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ బెర్త్‌లను మొదట లక్నో మెయిల్‌ 12230 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని త్రీ టైర్‌ ఏసీ బోగీల్లో ప్రవేశపెట్టారు. తర్వాత ఇతర బోగీల్లో కూడా తీసుకురానున్నారు. ఈ విషయమై లక్నో డివిజన్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ అతుల్‌ సింగ్‌ మాట్లాడుతూ..’ఈ బేబీ బెర్త్‌ను లోవర్‌ బెర్త్‌కు అనుసంధానిస్తారు. అవసరంలేని సమయంలో బేబీ బెర్త్‌ను ఫోల్డ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బెర్త్‌లను 76.2 ఎమ్‌ఎమ్‌ పొడవు, 255 ఎమ్‌ఎమ్‌ వెడల్పుతో రూపొందించారు’ అని చెప్పుకొచ్చారు.

రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చొరవతో..

రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చూపిన ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన అధికారుల రివ్యూ మీటింగ్‌లో మంత్రి ఈ ఆలోచనను ప్రాతిపాదించారన్నారు. చంటి బిడ్డలతో ప్రయాణించే తల్లులుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, త్వరలోనే వీటి సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బేబీ బెర్త్‌లను బుక్‌ చేసుకోవడంలో ఎలాంటి మెకానిజం లేదని, నేరుగా టికెట్‌ కలెక్టర్‌ను సంప్రదించి బేబీ బెర్త్‌ను పొందవచ్చని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలకు క్లిక్ చేయండి..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..