IndiGo: చిన్నారిపై ఇండిగో కాఠిన్యం.. దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కనివ్వని సిబ్బంది

ఓ చిన్నారి పట్ల ఇండిగో(IndiGo) సంస్థ అమానవీయంగా ప్రవర్తించింది. దివ్యాంగుడన్న కారణంతో బాలుడిని విమానంలోకి ఎక్కనివ్వకుండా దురుసుగా ప్రవర్తించింది. ఊహించని ఈ ఘటనతో ఆ కుటుంబసభ్యులు షాక్ అయ్యారు...

IndiGo: చిన్నారిపై ఇండిగో కాఠిన్యం.. దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కనివ్వని సిబ్బంది
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 09, 2022 | 5:34 PM

ఓ చిన్నారి పట్ల ఇండిగో(IndiGo) సంస్థ అమానవీయంగా ప్రవర్తించింది. దివ్యాంగుడన్న కారణంతో బాలుడిని విమానంలోకి ఎక్కనివ్వకుండా దురుసుగా ప్రవర్తించింది. ఊహించని ఈ ఘటనతో ఆ కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. తాము వెళ్లాలని, తమ ప్రయాణానికి అడ్డు రావద్దని ఆ కుటుంబం ఎంత వేడుకున్నా విమాన సిబ్బంది కనికరించలేదు. దీంతో చివరికి ఆ చిన్నారి కుటుంబం ప్రయాణాన్నే విరమించుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌(Hyderabad) వెళ్లేందుకు ఓ కుటుంబం దివ్యాంగ చిన్నారితో కలిసి రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. విమానం ఎక్కేందుకు చిన్నారి భయపడుతున్నాడని, దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పింది. అంతేకాకుండా వారిని విమానం ఎక్కనివ్వలేదు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇది చాలా అమానవీయ ఘటన అని ఆవేదన చెందారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

భయంతో ఉన్న ఆ చిన్నారి తన భయాన్ని వీడితే.. విమానం ఎక్కించడానికి సిబ్బంది వేచి చూశారని, కానీ ఫలితం లేకుండా పోయిందని విమానయాన సంస్థ చెప్పింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరినట్లు వెల్లడించింది. కాగా.. ఈ ఘటనపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని.. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

ఇవి కూడా చదవండి

Modi Scheme: మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ మూడు పథకాలకు ఏడేళ్లు పూర్తి.. రూ.312 వార్షిక ప్రీమియంతో రూ.4 లక్షల బెనిఫిట్‌