AP Weather: మండుటెండల్లో ‘ముసురు’కుంది.. ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. హైఅలెర్ట్..

ఆగ్నేయ- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో "అసని" తీవ్ర తుపానుగా కొనసాగుతోందని ఐఎండీ తెలియచేసింది. ప్రస్తుతం ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్ఛిమ వాయువ్య దిశగా కదులుతున్నట్టు పేర్కొంది.

AP Weather: మండుటెండల్లో 'ముసురు'కుంది.. ఏపీవైపు దూసుకొస్తున్న ‘అసని’.. హైఅలెర్ట్..
Cyclone Asani
Follow us

|

Updated on: May 09, 2022 | 3:10 PM

Asani Cyclone: ఆంధ్ర తీరం వైపు అసని తుఫాన్‌ దూసుకొస్తోంది. తీవ్ర తుఫాన్‌గా మారడంతో అధికారులు సైతం అలర్ట్‌ అయ్యారు. తీరం వైపు విరుచుకు పడే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు విపత్తుల నిర్వాహణ అధికారులు. ప్రస్తుతం నికోబార్ దీవుల్లోని కార్‌నికోబార్‌కు పశ్చిమవాయువ్యంగా 920 కిమీ, అండమాన్ దీవుల్లోని పోర్ట్‌ బ్లెయిర్‌కు పశ్చిమ వాయువ్యంగా 770 కి.మీ, విశాఖ (ఏపీ )కు ఆగ్నేయంగా 500 కి.మీ, పూరీ (ఒడిశా)కు 650 కి.మీ దూరంలో అసని కేంద్రీకృతమైంది. ఇది గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. తుఫాను రేపు సాయంత్రం వరకు వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odisha) తీరానికి వచ్చే అవకాశమున్నట్లు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం వైపు పయనించే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. విశాఖపై అసని తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వైజాగ్‌లో వాతావరణ మారిపోయింది.  బలమైన గాలులు వీయడంతో పాటు.. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.

తుఫాను ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు  భారీ గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ప్రకటించింది. అసని తుఫాను ప్రభావంతో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో రైతులు పండిన పంటలు, ప్రధానంగా వరి పంటలను వీలైనంత త్వరగా కోయాలని దక్షిణ బెంగాల్ జిల్లాల్లోని అధికారులను బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. వరి సాగు చేసిన రైతులు దాదాపు 50 శాతం పంట పొలంలో పడి ఉండడంతో రైతులు తమ పంటలను సరైన సమయంలో ఇంటికి చేర్చుకోలేకపోతే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Viral Video: ఒకే చెట్టుపై కుప్పలు.. తెప్పలుగా పాములు.. వీడియో

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!