Asani: అల్లకల్లోలంగా మారిన ఉప్పాడ తీరం.. అలల ఉద్ధృతికి కొట్టుకొస్తున్న భారీ నౌక
బంగాళాఖాతంలో(Bay of Bengal) అసని (Asani) తుపాను తీవ్రత కొనసాగుతోంది. అలల ఉద్ధృతి పెరుగుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో అలల ఉద్ధృతికి ఒక భారీ నౌక....
బంగాళాఖాతంలో(Bay of Bengal) అసని (Asani) తుపాను తీవ్రత కొనసాగుతోంది. అలల ఉద్ధృతి పెరుగుతుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో అలల ఉద్ధృతికి ఒక భారీ నౌక కొట్టుకొస్తోంది. ఉప్పాడ(Uppada) సముద్ర తీరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రానికి అలల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన సరకు రవాణా షిప్.. గాలులు,అలల తాకిడికి ఉప్పాడ సుబ్బుపేట సమీపానికి కొట్టుకొస్తోంది. తీరానికి కిలో మీటర్ దూరంలో నౌక కనిపిస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కోస్తాపై అసని తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్న అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం నాటికి విశాఖకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల వర్షాలుంటాయి.
బంగాళాఖాతం మధ్యలో ప్రస్తుతానికి గంటకు 115-125 కి.మీ వేగంతో గాలులు వీస్తుండగా తుపాను తీరానికి దగ్గరగా వస్తున్న కొద్దీ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ సమయానికి గంటకు 60 కి.మీ. వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయని పేర్కొంది. తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read
TS Inter English Exam 2022: ఆ జిల్లాలో గంట ఆలస్యంగా జరుగుతోన్న ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్ష..