AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore District: ప్రేమ ఉన్మాదం.. యువతిని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య

ప్రేమ ఉన్మాదం నెల్లూరు జిల్లాలో రెండు నిండు ప్రాణాలు బలిగొంది. ప్రేమించిన యువతితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన యువతి కావ్యను రివాల్వర్‌తో కాల్చి చంపాడు. ఆపై..

Nellore District: ప్రేమ ఉన్మాదం.. యువతిని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య
Ap Crime News
Ram Naramaneni
|

Updated on: May 09, 2022 | 6:10 PM

Share

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రేమ నెత్తురు చిందింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న అక్కసుతో ప్రేమించిన కావ్యను తుపాకీతో కాల్చి చంపాడు. అది కూడా ఆమె ఇంటికే వెళ్లి. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసి వెళ్తూ వెళ్తూ తానూ కాల్చుకుని చనిపోయాడు. కావ్య, సురేష్‌. వీళ్లిద్దరిదీ తాటిపర్తి గ్రామమే. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. సురేష్‌ బెంగళూరులో, కావ్య పూణేలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఇద్దరూ బెంగళూరులో కలిసి ఉద్యోగం చేశారు. ఆరునెలలుగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచీ కావ్యను పెళ్లి చేసుకుంటానని వెంటపడుతూ వచ్చాడు సురేష్‌. కానీ, కావ్యను సురేష్‌కు ఇచ్చేందుకు ఆమె పెద్దలు ఒప్పుకోలేదు. ఇవాళ కూడా పెళ్లి గురించి అడగడానికే వచ్చిన సురేష్.. చేతిలోకి గన్ తీసుకుని ఒక్కసారిగా కావ్యపై తెగబడ్డాడు. దూసుకొచ్చిన ఓ బులెట్‌ను తప్పించుకుందామె. మరో బుల్లెట్‌ మాత్రం శరీరంలోకి దూసుకెళ్లింది. ఆమెను ఉన్నపళంగా ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఉపయోగలేకపోయింది. దారిలోనే చనిపోయింది. ప్రస్తుతం నెల్లూరు GGHలో ఆమె డెడ్‌బాడీ ఉంది.

కావ్యను చంపేసిన తర్వాత సురేష్‌.. ఓ 2వందల మీటర్ల దూరం వెళ్లాడు. అదే తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో గన్‌తో కాల్చుకుని చనిపోయాడు. ఈ గన్‌పై MADE in USA అని ఉంది. సురేష్‌కి గన్‌ ఎక్కడి నుంచి వచ్చింది. USA మార్క్ ఉన్న గన్‌ నెల్లూరు జిల్లా తాటిపర్తి దాకా ఎలా వచ్చింది. అక్కడి నుంచి తెప్పించాడా.. నెల్లూరు సమీపంలోనే కొన్నాడా.. ఇవన్నీ మర్డర్, సూసైడ్ వెనుక తేలని అనేక అనుమానాలు.

ఇవి కూడా చదవండి

Also Read: Hyderabad: కంత్రీగాడు.. మాయ మాటలతో ఏకంగా 1000 మంది అమ్మాయిలను ముంచేశాడు..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..