Hyderabad: కంత్రీగాడు.. మాయ మాటలతో ఏకంగా 1000 మంది అమ్మాయిలను ముంచేశాడు..
అమ్మాయిలే అతని టార్గెట్. మాయ మాటలు చెప్పడం, లక్షల్లో డబ్బు కొట్టేయడం అతని నైజం. అతని పేరు వంశీ ఒక్కరు కాదు ఇద్దరూ కాదు ఏకంగా వెయ్యి మంది అమ్మాయిలు ఇతని మోసాలకు బలయ్యారు.
Telangana: టెక్నాలజీ జెట్ స్పీడ్‌తో పరుగులు తీస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్ సైబర్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అబ్బాయి అయి ఉండి అమ్మాయిల ఫేస్‌క్రిముల వాడితే పెద్దగా నష్టమేమి ఉండదు. కానీ అమ్మాయిగా పరిచయం చేసుకొని అమ్మాయిలను బోల్తా కొట్టించే ఇదిగో ఇలాంటి కంత్రీగాళ్లుంటారు తస్మాత్ జాగర్త. నెత్తిన పైన అరగుండే. కానీ ఇతని బుర్రనిండా కన్నింగ్ ప్లాన్లే. వంశీకృష్ణ అలియాస్ హర్షవర్ధన్ . సొంతూరు రాజమండ్రి. బతుకుబాటలో హైదరాబాద్‌లో వాలాడు. చదువు బిటెక్ డిస్ కంటిన్యూ. కానీ బిల్డప్ మాత్రం మాములుగా ఉండదు. .ఒకరిద్దరు కాదు వెయ్యి మంది యువతుల్ని మోసం చేసి అక్షరాల మూడున్నర కోట్ల దండుకున్నాడీ 420. అంత మందా? ఎలా ట్రాప్ చేశాడు? ఇది కామన్‌డౌట్. అసలు కిటుకు ఏంటంటే.. అమ్మాయి ఫోటోను డీపీగా పెట్టుకుని .. ఫ్రెండ్‌షిఫ్ పేరిట అమ్మాయిలకు మాత్రమే మెయిల్స్ చేస్తాడు.
మైండ్ గేమ్ ఆడటం ఇతని స్టైల్. నమ్మకం కుదిరించడానికి అడక్కుండానే డబ్బులు అకౌంట్లో వేస్తాడు.. చారిటీ కోసం ఖర్చు చేయాలని చెప్తాడు. లెక్కలు చూపించాల్సిన అవసరంలేదు అంటాడు. ఇలా ఒకటికి పది సార్లు వేల రూపాయలు డబ్బులు పంపి లెక్క కూడా అడగడు కానీ అదను చూసి సడన్ గా ఫోన్ చేసి తన అకౌంట్ బ్లాక్ అయిందని డబ్బులు కావాలంటు లక్షల్లో వసూలు చేస్తాడు. తరువాత సిమ్ కార్డ్స్ తీసేసి మాయం. దాదాపు వెయ్యి మంది వరకు ఇలా మోసం చేశాడు.
యానాం ఎమ్మెల్యే అశోక్ గొల్లపల్లి ఫోటోని ప్రొఫైల్ గా పెట్టుకొని చాలా మందిని ట్రాప్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ అప్పట్లో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. కాకినాడ పోలీసులు వంశీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిప్పకూడు తిన్నా కన్నింగ్ చిప్ మాత్రం మారడలేదు. మళ్లీ మోసాల బాటపట్టాడు. ఇతడిపై ఇప్పటికే 14 నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో 50 వరకు కంప్లైంట్లు ఎఫ్.ఐ.ఆర్ లు ఉన్నాయి. రీసెంట్ గా ఓ యువతిని ఇలాగే నమ్మించి 60 లక్షల ట్రాన్సాక్షన్స్ చేయడంతో.. యువతి సైబర్ క్రైమ్ పోలీసు నుంచి ఆశ్రయించగా వంశీకృష్ణ ను అరెస్ట్ చేశారు సైబారాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
Also Read: Anantapur: చీటింగ్‌కి కేరాఫ్ అడ్రస్.. అమాయక యువతులే ఈ ఎస్సై టార్గెట్.. లెక్కకు మించిన పాపాలు