Anantapur: చీటింగ్‌కి కేరాఫ్ అడ్రస్.. అమాయక యువతులే ఈ ఎస్సై టార్గెట్.. లెక్కకు మించిన పాపాలు

కీచక ఎస్సై విజయ్‌కుమార్‌ నాయక్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయ్‌. టీవీ9 వరుస కథనాలతో అతని భాగోతం మొత్తం బట్టబయలవుతోంది.

Anantapur: చీటింగ్‌కి కేరాఫ్ అడ్రస్.. అమాయక యువతులే ఈ ఎస్సై టార్గెట్.. లెక్కకు మించిన పాపాలు
Si The Cheater
Follow us
Ram Naramaneni

|

Updated on: May 07, 2022 | 1:59 PM

కీచక ఎస్సై విజయ్‌కుమార్‌ నాయక్‌ను అరెస్ట్‌ చేశారు అనంతపురం పోలీసులు. ఇంకెవరైనా బాధితులు ఉంటే ముందుకు రావాలన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ. విద్యార్ధిని సరస్వతి సూసైడ్‌ ఇన్సిడెంట్‌లో ఎస్సై విజయ్‌కుమార్‌పై 76, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్సై విజయ్‌పై చాలా ఆరోపణలు వస్తున్నాయన్నారు అనంతపురం జిల్లా ఎస్పీ. కదిరి(Kadiri), గుంతకల్‌(Guntakal)లో అమ్మాయిలను మోసంచేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉందని, వాటిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విజయ్‌ కుమార్‌… ప్రస్తుతం ప్రొబెషనరీ ఎస్సైగా ఉన్నందున అవసరమైతే డిస్మిస్ చేస్తామన్నారు ఎస్పీ. కీచక ఎస్సై విజయ్‌కుమార్‌ నాయక్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయ్‌. టీవీ9 వరుస కథనాలతో అతని భాగోతం మొత్తం బట్టబయలవుతోంది. ఒకరా… ఇద్దరా… ఎస్సై విజయ్‌ బాధితులు ఎంతోమంది. అలిగేషన్స్‌కు ఇక లెక్కే లేదు. సొంత భార్య కూడా గతంలో అతని బాధితురాలే అంటే ఎస్సై విజయ్‌ ఎంతటి దుర్మార్గుడో అర్ధం చేసుకోవచ్చు.

ఎస్సై విజయ్‌కుమార్‌పై గతంలో ఎంతోమంది అమ్మాయిలు కంప్లైంట్స్‌ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించారు. అతని చేతిలో మోసపోయి, బయటికి రానివాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారంటున్నారు సొంత గ్రామస్తులు. కదిరి, గుంతకల్‌లోనూ ఎస్సై విజయ్‌ ఆరోపణలు వచ్చాయి. గతంలో, మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై విజయ్‌, కొట్టాలలో మరో యువతిని ట్రాప్‌ చేసినట్టు అలిగేషన్స్‌ ఉన్నాయ్‌. గుంతకల్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి తన్నులు తిన్నాడు ఈ 420 ఎస్సై. ఎస్సై విజయ్‌ భార్య భారతి కూడా గతంలో అతని బాధితురాలే. తనను ప్రేమించి మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు విజయ్‌. ఎస్సై విజయ్‌పై గతంలో అనంతపురం దిశ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది అతని భార్య భారతి.

ఎస్సై విజయ్‌ చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న సరస్వతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సై విజయ్‌ను ఉరి తీయాలంటూ అనంతపురం ఆస్పత్రికి ముట్టడించారు. ఇలాగే వదిలేస్తే, అతని చేతిలో ఎంతోమంది అమ్మాయిలు బలైపోతారంటున్నారు సరస్వతి కుటుంబ సభ్యులు.

Also Read: Viral: ఇంట్లోని పెరట్లో నక్కిన సింహం.. సమాచారంతో అధికారులు హైఅలెర్ట్.. చివరకు తుస్