AP Edcet 2022: ఏపీ ఎడ్‌సెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..

ఏపీ ఎడ్‌సెట్‌ 2022 నోటిఫికేషన్‌ (AP Edcet 2022 Notification)ను ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ టి అముదవల్లి శుక్రవారం (మే 6) విడుదల చేశారు..

AP Edcet 2022: ఏపీ ఎడ్‌సెట్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..
Ap Edcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 07, 2022 | 4:50 PM

AP Edcet 2022 exam date: బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2022 నోటిఫికేషన్‌ (AP Edcet 2022 Notification)ను ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ టి అముదవల్లి శుక్రవారం (మే 6) విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ మే 9 నుంచి జూన్‌ 7 వరకు కొనసాగుతుంది. ఆసక్తికలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్ధులకు రూ.650, బీసీ అభ్యర్ధులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.450లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP EDCET 2022) జులై 13న నిర్వహిస్తారు. బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తివివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు.

Also Read:

PNB SO Recruitment 2022: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎస్‌ఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? నేటితో ముగుస్తున్న..