AP: టెన్త్​ ఎగ్జామ్ రాస్తూ కళ్లు తిరిగి పడిపోయిన స్టూడెంట్.. అసలు విషయం తెలిసి అందరూ షాక్

టెన్త్​ క్లాస్ ఎగ్జామ్ రాస్తూ ఓ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అలెర్టైన సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత...

AP: టెన్త్​ ఎగ్జామ్ రాస్తూ కళ్లు తిరిగి పడిపోయిన స్టూడెంట్.. అసలు విషయం తెలిసి అందరూ షాక్
Telangana Health department
Follow us
Ram Naramaneni

|

Updated on: May 07, 2022 | 1:42 PM

Alluri Sitharama Raju district: డియర్ పీపుల్.. కరోనాను అస్సలు లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మహమ్మారి రూపాన్ని మార్చుకుంటూ పోతుంది. ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలీదు. అనుక్షణం అలెర్ట్‌గా ఉండాలి. జనసందోహం ఉన్న ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు జాగ్రత్తులు తీసుకోవాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అన్నం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవన్నీ తెలిసినవేగా మళ్లీ చెప్తున్నారు ఎందుకు అనుకోకండి. మహమ్మారి మానవాళికి చేసిన డ్యామేజ్ అంతా.. ఇంతా కాదు. ఎంతోమంది ఆప్తులను కోల్పోయాం. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రజంట్ వైరస్ వ్యాప్తి కంప్లీట్‌గా తగ్గినట్లుగా కనిపిస్తున్నా.. మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది.  తాజాగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్​గా తేలడంతో.. అక్కడ అందరిలోనూ టెన్షన్ మొదలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం(Rampachodavaram) నియోజకవర్గం గంగవరం(gangavaram) ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి పదో తరగతి సోషల్ ఎగ్జామ్ రాస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అలెర్టయిన స్కూల్ యాజమాన్యం, సిబ్బంది.. ఆస్పత్రికి తరలించి పలు రకాలు పరీక్షలు చేశారు. అందులో కొవిడ్ టెస్ట్ కూడా ఉంది. ఆ కుర్రాడికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. పరీక్ష పూర్తయిన తర్వాత మిగిలిన 22 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. అందరికీ నెగిటివ్​గా తేలిడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  విద్యార్థి మోహనాపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థిగా గుర్తించారు. మెడిసిన్ ఇచ్చి హోమ్ క్వారంటైన్​లో ఉండాలని డాక్టర్లు అతడికి సూచించారు.

Also Read: Viral: ఇంట్లోని పెరట్లో నక్కిన సింహం.. సమాచారంతో అధికారులు హైఅలెర్ట్.. చివరకు తుస్…..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..