AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్నటిదాకా ఆత్మహత్య.. ఇప్పుడు రేప్ జరిగిందని కేసు నమోదు.. బీఫార్మసీ విద్యార్థిని హత్యకేసులో పోలీసుల తీరుపై విమర్శలు..

B Pharmacy student Murder case: అత్యాచారం జరిగిందనే ఆరోపణలు మిన్నంటాయి. అయితే డీఎస్పీ మాత్రం రేప్‌ వార్తల్ని కొట్టిపడేశారు. జస్ట్ హ్యాంగింగ్‌ మాత్రమేనని అన్నారు. అదే డీఎస్పీ ఇప్పుడు రేప్ జరిగిందని నిర్దారించారు. బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో..

నిన్నటిదాకా ఆత్మహత్య.. ఇప్పుడు రేప్ జరిగిందని కేసు నమోదు.. బీఫార్మసీ విద్యార్థిని హత్యకేసులో పోలీసుల తీరుపై విమర్శలు..
B Pharmacy student Murder case
Sanjay Kasula
|

Updated on: May 09, 2022 | 12:08 PM

Share

బీఫార్మసీ స్టూడెంట్ తేజస్విని(B Pharmacy student) హత్యకేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకొస్తున్నాయి. నిన్నటిదాకా తేజస్వినిది ఆత్మహత్య అన్నారు.. ఇప్పుడు రేప్ జరిగిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజులు తిరిగేసరికల్లా ఒక డీఎస్పీ రెండు మాటల వెనుక ఆంతర్యమేంటి? డాక్టర్లు కూడా రేప్‌ జరగలేదని ఎందుకు నిర్ధారించారు? పోస్టుమార్టం రెండుసార్లు జరిపినా అసలు నిజాలు ఎందుకు బయటకురాలేదు? సంచలనం రేపిన ఈ కేసులో ఎందుకీ కన్ఫ్యూజన్‌? శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన తేజస్విని.. ఓ షెడ్డులో చున్నీతో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గోరంట్లకు చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారంతో పాటు అత్యాచారం జరిగిందనే ఆరోపణలు మిన్నంటాయి. అయితే డీఎస్పీ మాత్రం రేప్‌ వార్తల్ని కొట్టిపడేశారు. జస్ట్ హ్యాంగింగ్‌ మాత్రమేనని అన్నారు. అదే డీఎస్పీ ఇప్పుడు రేప్ జరిగిందని నిర్దారించారు. బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడైన సాదిక్​ను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రమాకాంత్, దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

ప్రేమ పేరుతో తేజస్వినిని నమ్మించి.. శారీరకంగా అనుభవించి ఆమె మృతికి కారణమైన సాధిక్​ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం, సెల్​ఫోన్​ సీజ్ చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం 376 సెక్షన్​తో పాటు 420, 306 సెక్షన్లు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

తేజస్వినిపై అత్యాచారం జరిగిందని స్తానికులతో పాటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్పీ వాహనాన్ని అడ్డుకుని వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులు రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించారు. కానీ రేప్ జరిగినట్టు ఎక్కడా నిర్దారించలేదు.

ఇవి కూడా చదవండి

డాక్టర్లది, పోలీసులది ఓకేమాట. అసలు ఎందుకీ అయోమయం. తమ బిడ్డను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వాళ్ల బాధను, ఆవేదనను పోలీసులు, డాక్టర్లు ఎందుకు లైట్‌గా తీసుకున్నారు. డాక్టర్లు, పోలీసుల భిన్న వాదనల వెనుక ఎవరున్నారు? తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే సాదిక్ అఙ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

క్రైమ్ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..