AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saroor Nagar Murder Case: నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు.. కస్టడీకి అప్పగించాలంటూ ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్..

Nagraju Murder Case: హత్య జరిగేటప్పుడు ఐదుగురు ఉన్నారని నాగరాజు భార్య ఆశ్రీన్ చెబుతోంది. ఇప్పటికే సంఘటన స్థలంలో ఇద్దరిని గుర్తించిన పోలీసులు మిగతా వారు ఎవరూ..? అనే తేల్చేందుకు విచారణ మొదలు పెడుతున్నారు. నాగరాజును..

Saroor Nagar Murder Case: నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు.. కస్టడీకి అప్పగించాలంటూ ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్..
Saroor Nagar Nagraj Brutal
Sanjay Kasula
|

Updated on: May 09, 2022 | 1:30 PM

Share

ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ దళిత యువకుడు నాగరాజు(Nagraju Murder Case) దారుణ హత్యకేసును చేదించే పనిలో పడ్డారు. హత్య సమయంలో ఎంత మంది ఉన్నరు..? మృతుడి భార్య ఆశ్రీన్ ఎంత మందిని గుర్తించింది..? పోలీసులు ఎంత మందిని నిర్దారించారు..? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అయితే తాజాగా  నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య సమయంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హత్య జరిగేటప్పుడు ఐదుగురు ఉన్నారని నాగరాజు భార్య ఆశ్రీన్ చెబుతోంది. ఇప్పటికే సంఘటన స్థలంలో ఇద్దరిని గుర్తించిన పోలీసులు మిగతా వారు ఎవరూ..? అనే తేల్చేందుకు విచారణ మొదలు పెడుతున్నారు. నాగరాజును గుర్తించేందుకు నిందితులు మొబైల్ ట్రాకర్ యాప్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేశారనే దానిపై కూడా అరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు మోబిన్ స్నేహితుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక నిందితులను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దళితుడి దారుణ హత్యపై నేషనల్‌ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌ అయింది. ఈ బ్రూటల్‌ మర్డర్‌ను సుమోటో కేసుగా తీసుకుంది. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ ట్వీట్‌కు స్పందించిన కమిషన్‌.. ఆ వెంటనే చర్యలు మొదలుపెట్టింది. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును నడిరోడ్డుపై ఆమె సోదరుడు మొబీన్‌ రాడ్‌తో కొట్టి చంపాడు.

నాగరాజు పాశవిక హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన క్రమంగా మతం కోణం సంతరించుకుంది. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకే దళిత హిందూ యువకుడిని దారుణంగా చంపేశారని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హత్యను ఖండిస్తూ ట్వీట్‌ చేశారు బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌.

ఇవి కూడా చదవండి

తరుణ్‌చుగ్ ట్వీట్‌కి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌ విజయ్‌ సాంప్లా స్పందించారు. ఈ ఘటనపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని తెలంగాణ చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ఘటనను సుమోటో తీసుకుని విచారణ చేయనున్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..