Viral Video: ఈ బుజ్జోడి నటన అదిరిపోయిందిగా.. మహా నటులనే మించిపోయాడంటున్న నెటిజన్లు..

చిన్నారులు చేసే జిమ్మిక్కులు చాలా క్యూట్‌గా ఉంటాయి. అయితే ఇవాళ అచ్చు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో..

Viral Video: ఈ బుజ్జోడి నటన అదిరిపోయిందిగా.. మహా నటులనే మించిపోయాడంటున్న నెటిజన్లు..
Excellent Acting Video
Follow us
Sanjay Kasula

|

Updated on: May 09, 2022 | 11:43 AM

పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. వారు చేసే చిలిపి పనులు అందరిని ఆకట్టుకుంటాయి. అదే సమయంలో పిల్లలు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులోనూ తల్లిని చెప్పే పదాలను అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో చిలిపి పలుకులు ఆకట్టుకుంటాయి. వారు చేస్తున్న పనులు, వారు ముద్దు ముద్దు పలుకులను చూస్తే విచారంగా ఉన్నవారు కూడా సంతోషంగా నవ్వేస్తారు. ఒక్కోసారి చిన్నారులు చేసే జిమ్మిక్కులు చాలా క్యూట్‌గా ఉంటాయి. అయితే ఇవాళ అచ్చు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిన్నారి నటన అద్భుతంగా ఉండటంతో నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు. ఓ చిన్న పిల్లాడు కుర్చీలో కూర్చుని నవ్వుతూ ఉండడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇంతలో, పిల్లవాడు ఉద్దేశపూర్వకంగా వేరే విధంగా ముఖం పెట్టడం.. ఆ తర్వాత నవ్వడం..

 ఈ సరదా వీడియోను ఇక్కడ చూడండి-

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by hepgul5 ?? (@hepgul5)

మనం నటన అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇలా నేటి తరం యవ నటులు గుర్తు వస్తారు. కానీ ఈ వీడియోలోని బుజ్జోడి నటన వారిని మించిపోయాలా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా అని ఇందులోని బుజ్జోడి వయసు ఎంతో మీరే చూశారుగా.. ఇంత చిన్న పిల్లవాడు చూసింది.. చూసినట్లుగా అనుకరించడం అందరిని మతి పొగొడుతోంది. వీడియోలో ఆ బుజ్జోడి తల్లి అడిగిన ప్రశ్నలకు సరిగ్గా చేసిన చూపించడం.. తిరిగి నవ్వడం ఇలా రెండుసార్లు చేస్తాడు. ఆ చిన్నోడి నటన చాలా ఆందంగా ఉందని.. ఆ చిన్నారి ఎక్స్‌ప్రెషన్‌ని చూసి నెటిజన్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో చూడవచ్చు. అలాగే సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి కామెంట్ బాక్స్ లో చిన్నారిపై ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. అదే సమయంలో వేలాది మంది ఈ వీడియోను కూడా లైక్ చేసారు. ఈ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..