Viral: అట్లుంటది ముచ్చట మనతోని.. డీజేతో పోలీసులనే బ్రేక్ డ్యాన్స్ చేయించాడు.. చూస్తే మైండ్ బ్లాకే!

అమ్మో.! ఇప్పటిదాకా డీజే అంటే అక్కడ పాటొస్తే దానికి మనం డ్యాన్స్ చేయడమే అనుకున్నా.. కానీ అది కూడా మనతో డాన్స్ చేయడమంటే..!

Viral: అట్లుంటది ముచ్చట మనతోని.. డీజేతో పోలీసులనే బ్రేక్ డ్యాన్స్ చేయించాడు.. చూస్తే మైండ్ బ్లాకే!
Dj
Follow us
Ravi Kiran

|

Updated on: May 09, 2022 | 9:53 AM

మైఖేల్ జాక్సన్.. చిరంజీవి.. ప్రభుదేవా… హృతిక్ రోషన్.. అల్లు అర్జున్… వీళ్లందరికీ కామన్‌గా ఉన్న ఒకే ఒక్క పాయింట్ డ్యాన్స్.. వీళ్లు డ్యాన్స్‌లో దుమ్ములేపుతారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఓ కొత్త పేరొచ్చి చేరింది. అసలు ఈ క్యాండిడేట్ చేసే డ్యాన్స్ వీళ్ల వల్ల కూడా సాధ్యం కాదు.. వీళ్లకు అస్సలు రాదు అంటే నమ్ముతారా.! ఏంటి.. అవునా.! అబ్బచ్చా.. కొత్త హీరో ఎవరతడు.? మా హీరో కంటే తోపా అని అనుకుంటున్నారా..! ఏ హీరో కాదు.. హీరోయిన్ కాదు.. ఆ మాటకొస్తే అసలు మనిషే కాదు.. ఒకసారి మీరే చూడండి.. ఆ డ్యాన్స్ చూస్తే మీ కళ్లు పేలిపోతాయి.

వీడియోను ఓసారి చూసేయండి మరి.. అమ్మో.! ఇప్పటిదాకా డీజే అంటే అక్కడ పాటొస్తే దానికి మనం డ్యాన్స్ చేయడమే అనుకున్నా.. కానీ అది కూడా మనతో డాన్స్ చేయడమంటే..! ఇలాంటిది నేనెక్కడా చూళ్లేదయ్యో.. ఇలాంటి డీజేలకి.. ఎంత ఖర్చైనా పర్లేదు… మనం పెట్టించుకోవాలి. ఇక అసలు విషయమేంటో మీకర్థమైందా… ఫస్ట్ మన డీజే సార్.. అలా వెహికల్ని అష్ట వంకరలు తిప్పించాడు… సముద్రపు అలల్లా ఉరికించాడు.. విషయం తెలిసి పోలీస్ లొస్తే వాళ్లకు కూడా టోపీ పెట్టి పారిపోయాడు.. కానీ బండికి మాత్రం ఏం కాలేదు. అది గుర్తించాలి మీరు.. అయినా మీరేంటి సార్… అస్సలు కిందపడకుండా… వెహికల్‌ని అంత షేక్ డ్యాన్స్ చేయించాడంటే అదొక ఆర్ట్.. ఆయనొక ఆర్టిస్ట్.. ఆర్టిస్టులను అరెస్ట్ చేస్తారా చెప్పండి.. సర్లేండి..! ఫన్ అంతా పక్కన పెట్టి.. మీరూ వీడియోపై లుక్కేయండి.. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోండి.. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదంతా కూడా రాజస్థాన్‌లో జరిగింది.

Also Read: Viral: నదిలో తేలుతున్న బ్యాగు.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

ఇవి కూడా చదవండి