Crime News: పెళ్లై 36 రోజులే.. భర్తను చంపేందుకు రెండు సార్లు ప్లాన్.. చివరకు ప్రియుడితో కలిసి..

దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్‌ (24) కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19) తో గత మార్చి 23న పెళ్లయింది.

Crime News: పెళ్లై 36 రోజులే.. భర్తను చంపేందుకు రెండు సార్లు ప్లాన్.. చివరకు ప్రియుడితో కలిసి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2022 | 8:48 AM

Wife murder husband: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని కట్టుకున్న భర్తను.. భార్య శ్యామల కడతేర్చింది. ప్రియుడు సహకారంతో భర్తను చంపింది. సిద్ధిపేట పట్టణ టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్‌ (24) కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19) తో గత మార్చి 23న పెళ్లయింది. అయితే.. గుడికందులకు చెందిన శివకుమార్‌ (20), శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కుటుంబసభ్యుల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న శ్యామల ప్రియుడు శివతో కలిసి హత్యకు ప్రణాళిక వేసింది. భర్త అడ్డు తొలగించుకునేందుకు గతంలో ఓసారి ప్లానేసి ఫెయిల్‌ అయింది. ఆ తర్వాత ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి శ్యామల మరోసారి హత్యకు కుట్ర చేసింది.

ఏప్రిల్ 28న చిన్నకోడూర్ మండలం ఆనంతసాగర్ క్షేత్రంలో మొక్కు ఉందని భర్తను నమ్మించి శ్యామల తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఏకాంతంగా గడుపుదామంటూ అనంతసాగర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసిన.. ప్రియుడు శివ, అతని స్నేహితులు నలుగురితో కలిసి శ్యామల భర్త చంద్రశేఖర్‌ను గొంతు నులిమి హత్య చేశారు. తరువాత దర్శనానికి వస్తే చంద్రశేఖర్‌కి గుండెపోటు వచ్చి చనిపోయాడని నమ్మించింది. కాగా.. పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపినట్లు తేలింది. ఈ కేసులో భార్య శ్యామల, ఆమె ప్రియుడు శివ, గుడికందుల గ్రామనికే చెందిన రాకేష్, రంజిత్ లతోపాటు, హత్యకు సహకరించిన భార్గవ్, సాయి కృష్ణలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు.

ఇదిలాఉంటే.. గత ఏప్రిల్‌ 19న ఆహారంలో ఎలుకల మందు కలిపి.. భర్తకు పెట్టింది. దీంతో అస్వస్తతకు గురైన చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని భర్త ఇంటికి వచ్చాడు. ఆహారంలో ఏదో తేడా జరిగిందని అప్పుడు భావించాడు. ఈ క్రమంలోనే ఆలయంలో మొక్కు ఉందంటూ తీసుకెవెళ్లి మళ్లీ అక్కడ ప్లాన్ వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నేరానికి పాల్పడిన వారంతా 25 ఏళ్లలోపు వారే ఉన్నారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..