Instagram: యూజర్ల పుట్టిన రోజు వివరాలను కోరుతోన్న ఇన్‌స్టాగ్రామ్.. కారణం ఏంటో తెలుసా.?
Instagram: ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) హవా బాగా పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ అకౌంట్ తెరిచేస్తున్నారు. దీంతో పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మైనర్లపై సోషల్ మీడియా...
Instagram: ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) హవా బాగా పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ అకౌంట్ తెరిచేస్తున్నారు. దీంతో పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మైనర్లపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారుల కోసం ప్రత్యేకంగా యాప్‌లు తీసుకొచ్చాయి. అయితే చాలా మంది మైనర్లు పెద్దలు వాడే సైట్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ నడుము బిగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సైనప్ చేసుకునే వారికి ఇప్పటి వరకు పుట్టిన రోజున నమోదు చేయమని అడగలేదు.
అయితే తాజాగా ఇకపై ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను తప్పనిసరి చేయాలని చూస్తోంది ఇన్‌స్టాగ్రామ్. 13 ఏళ్లలోపు ఉన్న మైనర్ యూజర్ల సంఖ్యను తగ్గించేందుకుగానే ఇన్‌స్టాగ్రామ్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అకౌంట్ ఉన్న వారు కూడా పుట్టిన రోజు వివరాలను ఎంటర్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను సూచించింది. అయితే యూజర్లు తప్పుడు ఏజ్‌ను ఎంటర్ చేసే అవకాశం ఉన్న వాదన కూడా వినిపించే అవకాశాలున్న నేపథ్యంలో, ఫేక్ బర్త్‌డేలను గుర్తించేదుకుగాను ఫేస్‌బుక్ డేటాను క్రాస్ చెక్ చేయనున్నారు.
ఒకవేళ ఫేస్‌బుక్‌లో ఎంటర్ చేసిన తేదీకి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్ చేసిన తేదీకి వ్యత్యాసం ఉంటే ఇన్‌స్టాలో సైనప్ అవ్వదు. ఈ రకంగా ఫేక్ ఐడీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఇన్‌స్టాగ్రామ్. ఈ విషయమై యూజర్లకు సమాచారం ఇస్తూ.. ‘ఇంతకుముందులాగే ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకోవాలంటే మీ పుట్టినరోజు తేదీలను నమోదు చేసుకోండి. ఇన్‌స్టా కమ్యూనిటీ భద్రతకు ఇది సాయపడుతుందని భావిస్తున్నాం. మీ వివరాలు పబ్లిక్ ప్రొపైల్‌లో షేర్ కావు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ఓ అలర్ట్ ఇచ్చింది.