7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలాంటి వార్త.. జులైలో డీఏ పెంపు? ఎంత పెరగనుంది?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పండుగ లాంటి వార్త. జులై లేదా ఆగస్టు నెలలో డీఏ కి సంబంధించి కీలక ప్రకటన వెలువడే ఛాన్స్..

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగలాంటి వార్త.. జులైలో డీఏ పెంపు? ఎంత పెరగనుంది?
DA
Follow us

|

Updated on: May 09, 2022 | 5:35 PM

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పండుగ లాంటి వార్త. జులై లేదా ఆగస్టు నెలలో డీఏ కి సంబంధించి కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవును.. 7వ వేతన సంఘం ప్రకారం.. ప్రభుత్వ డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) మరోసారి పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. మొదటిది జనవరి నుంచి జూన్ వరకు ఇవ్వడం జరుగుతుంది. రెండవది జులై నుంచి డిసెంబర్ వరకు వర్తిస్తుంది. ఇప్పుడు మార్చిలో 2022 సంవత్సరానికి గాను డిఎ మొదటి పెంపుదల గురించి ప్రకటించారు. ఏఐసీపీ ఇండెక్స్‌లో పెరుగుదల కారణంగా తదుపరి పునఃసమీక్ష జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

జులైలో ఎంత డీఏ పెరిగే అవకాశం ఉంది..? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డీఏ మరో నాలుగు శాతం పెరగవచ్చు. అంటే మొత్తం డీఏ 38 శాతానికి చేరుకోవచ్చు. డీఏ రివిజన్ నిర్ణయంలో కీలకమైన మార్చి ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలు డీఏ పెంపునకు అంగీకరించాయి. జూలై-ఆగస్టు కాలంలో డీఏ పెంపు దాదాపు 4 శాతం రావచ్చు, అయితే రాబోయే మూడు నెలల ACPI గణాంకాలు అంటే ఏప్రిల్, మే, జూన్‌లకు సంబంధించి ఇంకా నిర్ధారించలేదు.

ఇవి కూడా చదవండి

1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూర్చేందుకు, ధరల పెరుగుదలను భర్తీ చేసేందుకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్)లను 3 శాతం నుండి 34 శాతానికి పెంచతూ మార్చి 30న కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన వాయిదా జనవరి 1,2022 నుంచి అమల్లోకి వస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములా ప్రకారం ఈ పెంపు ఉంటుంది. ఇటీవలి ప్రకటనలో జులై నెలలో నిర్ణయించబడే తదుపరి డీఏ పెంపుపై కూడా ఉద్యోగులు, పెన్షన్‌దారుల్లో ఆశలు పెరిగాయి.