AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keto Diet Tips: ఈ వ్యక్తులు కీటో డైట్‌ని ఫాలో అవ్వొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..

Keto Diet Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవన శైలి లేక చాలా మంది ప్రజలు స్థూలకాయం బారిన పడుతున్నారు. విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు.

Keto Diet Tips: ఈ వ్యక్తులు కీటో డైట్‌ని ఫాలో అవ్వొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..
Keto
Shiva Prajapati
|

Updated on: May 09, 2022 | 6:30 AM

Share

Keto Diet Tips: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవన శైలి లేక చాలా మంది ప్రజలు స్థూలకాయం బారిన పడుతున్నారు. విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దాంతో పెరుగుతున్న బరువును కంట్రోల్ చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డైటింగ్ అని, జిమ్ అని, వ్యాయామం అని, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఉపవాసాలు చేస్తున్నారు. అయితే, వీటిలో డైట్, ఉపవాసం ప్రయత్నాలు శరీర బరువు తగ్గకపోగా.. ఇతర కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోతే శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అదికాస్తా వాంతులు, తలతిరగడం, వికారం, బలహీనత వంటి సమస్యలకు దారి తీస్తుంది.

ఇదిలాఉంటే.. చాలా మంది తమ బరువును తగ్గించుకునేందుకు కీటో డైట్‌ను అనుసరిస్తున్నారు. ఈ కీటో డైట్‌లో అధిక కొవ్వు, తక్కువ పిండి పదార్థాల నియమం ఆధారంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో 75 శాతం కొవ్వు, 20 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. తక్కువ కార్బ్ కారణంగా శరీరంలో శక్తి ఉత్పత్తి కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల కీటోన్లు ఏర్పడుతాయి. ఇవి కొవ్వును శక్తిగా మార్చడానికి పని చేస్తాయి. ఈ ఆహారం వ్యక్తి శరీర బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. కొందరు దీనిని అనుసరించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. కీటో డైట్ రోటీన్ ఫుడ్ కొందరు వ్యక్తులకు హానీ కలిగిస్తుందట. మరి ఏ వ్యక్తులు కీటో డైట్‌ను ఫాలో అవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం బాధితులు.. ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరిగినట్లయితే.. షుగర్ లెవల్స్‌ని నియంత్రించడానికి ఇన్సులిన్ తీసుకోవడం తప్పనిసరి. ఇలా ఇన్సులిన్ తీసుకునే వారు కీటో డైట్‌ను పాటించకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవాలి. అదే సమయంలో శరీరానికి సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. లేదంటే, అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

18 ఏళ్లలోపు వయస్సువారు..

18 ఏళ్ల వయసు లోపు పిల్లల శరీరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల వీరు పిండి పదార్థాలు, ప్రోటీన్, ఇతర పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కీటో డైట్ అంటే తక్కువ కార్బ్ డైట్ వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. పిల్లలు అధిక బరువు ఉన్నప్పటికీ.. కీటో డైట్ ఫాలో అవకూడదు. బరువును తగ్గించుకోవడానికి తక్కువ కేలరీలు కలిగి ఆహారం తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీలు..

గర్భిణీ స్త్రీలు, శిశువు తల్లులు కీటో డైట్‌ను ఫాలో అవ్వొద్దు. ఈ ఆహారం బరువు తగ్గడానికి కారణం అవుతుంది. అయితే, ఆ బరువు తగ్గడం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకని గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఈ డైట్‌ను ఫాలో అవ్వొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.